పవన్ కళ్యాణ్ ను అమాయకుడిని చేసి కూటమిలో జనసేన సీట్లకు కోత పెట్టారని ఏపీ పరిశ్రమల శాఖమంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. బిజెపితో జతకట్టిన టిడిపి జనసేనలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై ఏమి సమాధానం చెప్తాయనీ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం కలవచర్లలో 20 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ పార్కుకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చూసి ఓటేయమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరుతుంటే పొత్తులను చూసి ఓటేయమని ప్రతిపక్షాలు అడుగుతున్నాయనీ అన్నారు. గతంలో కంటే వైసీపీకి ఎక్కువ సీట్లు రావడం ఖాయమని అమర్నాథ్ పేర్కొన్నారు. ఏపీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు ఉన్న విలువ పవన్ కల్యాణ్‌కు సెటైర్ వేశారు. చంద్రబాబు జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుంది ప్రజల కోసం కాదని.. అధికార దాహంతోనే ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. ఎంతమంది కలిసి వచ్చిన.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజల మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు. గీతాంజలి మృతికి కారణమైన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదని మంత్రి అమర్నాథ్ హెచ్చరించారు.
Akkineni Nagarjuna: పాకిస్థాన్ లో నాగార్జున.. నెలకు లక్షల్లో సంపాదన..?
