కూటమి ప్రభుత్వం గడిచిన సంవత్సర కాలం నుండి సంక్షేమ పథకాలు అమలు చెయ్యకుండా.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద బురద జల్లి కాలం గడిపేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోలులో దాదాపు 11వేల కోట్ల స్కాం జరిగిందని, ప్రభుత్వ ఖజానాపై ఎంతో భారం పడుతుందని మండిపడ్డారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి.. అధికారంలోకి వచ్చాక అధిక రేట్లు పెంచేస్తున్నారని గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ… ‘కూటమి ప్రభుత్వం గడిచిన సంవత్సర కాలం నుండి సంక్షేమ పథకాలు అమలు చెయ్యకుండా వైఎస్ జగన్ మీద బురద జల్లి కాలం గడిపేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో 2.49 పైసలుకి కరెంట్ కొంటే అవినీతి చేశామని గగ్గోలు పెట్టిన మీరు ఇప్పుడు 4.60 పైసలకి 20 సంవత్సరాలు ఏ రకంగా ఒప్పందం చేసుకున్నారు. విద్యుత్ కొనుగోలులో దాదాపు 11వేల కోట్ల స్కాం జరిగింది. ప్రభుత్వ ఖజానాపై ఎంతో భారం పడుతుంది. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి, అధికారంలోకి వచ్చాక అధిక రేట్లు పెంచేస్తున్నారు. విద్యుత్ ఛార్జిలే కాకుండా అన్ని నిత్యవసర ధరలు పెరిగిపోయాయి’ అని మండిపడ్డారు.
Also Read: Simhachalam Incident: సింహాచలం ఘటన.. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన కమిషన్!
‘కావాల్సిన వారికి తక్కువ ధరలకే భూములు కట్టబెట్టేస్తున్నారు. ఈ సంవత్సర కాలంలోనే ఇసుక, భూమి, బెల్ట్ షాపులు ఇలా అన్నిటిపై ఎక్కడ చూసినా అవినీతి, అవినీతి, అవినీతే. సింహాచలం సంఘటనకి ప్రభుత్వమే కారణం. కాంట్రాక్టర్‌ను స్పీడుగా వర్క్ చెయ్యమని అధికారులు కంగారు పెట్టిన కారణంగా ఈ సంఘటన జరిగింది. చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్లు అమరావతి పునఃనిర్మాణం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పీఎం మోడీ రాష్ట్రానికి ఏమి హామీ ఇవ్వలేదు. ఈ కూటమి చేస్తున్న అవినీతి, మోసాన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న మోసపూరిత చర్యలను వెనక్కి తీసుకునేంత వరకు పోరాడతాం’ అని గుడివాడ అమర్నాథ్ చెప్పారు.
