Site icon NTV Telugu

Gudivada Amarnath: బాలకృష్ణ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం..

Pawan

Pawan

Gudivada Amarnath: కూటమి ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రభుత్వ కార్యాలయాల దండుకుంటున్నారో చెబుతూ బరితెగించి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. తాజాగా అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చే వారికి మందు తాగారా లేదా అని తెలుసుకునేందుకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలి, ముఖ్యంగా బాలకృష్ణకు నిర్వహించాలన్నారు. చిరంజీవి అంటే బాలకృష్ణకి ఈర్ష, గతంలో చిరంజీవిని చాలా సార్లు అవమానించారన్నారు.. బాలకృష్ణకి చిరంజీవికి అసలు పోలికే లేదని.. చిరంజీవి స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి బాలకృష్ణ తండ్రి పేరు చెప్పుకొని వచ్చాడన్నారు.. బాలకృష్ణకు చిరంజీవి నేను ఒకటే అని ఫీలింగ్ బాలకృష్ణది చిరంజీవికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు..

READ MORE: Smart Backpack: ఇన్-బిల్ట్ ఛార్జింగ్.. ఫోన్‌ను ఛార్జ్ చేసే పవర్ ఫుల్ స్మార్ట్ బ్యాగ్‌లు విడుదల.. ధర ఎంతంటే?

సినిమా ఇండస్ట్రీ బాగుండాలని జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి కలిస్తే బాలకృష్ణ ఓర్వలేకపోయాడని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.. నీ తండ్రిపై చెప్పులు వేయించి బట్టలు ఊడదీస్తే ఇంట్లో కూర్చున్న సంస్కారం లేని వ్యక్తి బాలకృష్ణ అన్నారు.. బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇంతమంది మాట్లాడుతున్నా, జనసేన నుంచి ఏ ఒక్కరు మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు.. చిరంజీవి ప్రముఖ సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలన్నారు.. బాలకృష్ణ గతంలో జన సైనికులను సంకరజాతి నా కొడుకులు అని మాట్లాడిన, పవన్ కళ్యాణ్ తల్లిని అవమానించిన టీడీపీని సమర్థించిందన్నారు.. పవన్ కళ్యాణ్ ని ఈ స్థాయికి తీసుకొచ్చిన అన్న చిరంజీవి గురించి బాలకృష్ణ కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ స్పందించుకోవడాన్ని జన సైనికులు, ప్రజలు గమనించాలని కోరారు.

READ MORE: Flood Alert: ఏపీలో కృష్ణా, గోదావరి నదులు ఉద్ధృతి.. సాయం కోసం ఈ నంబర్‌లకు కాల్ చేయండి..

Exit mobile version