సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో గవర్నర్ తమిళసై వైఖరిపై గూడెం మహిపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ తమిళ సై ఆలోచనలు, ఆమె విధానాలు బీజేపీ కార్యకర్త చేస్తున్నట్లే ఉందన్నారు. పదవికి వన్నె తెచ్చే విధంగా చూడాల్సిన గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక దిశగా పనిచేయటం మంచిది కాదని మండిపడ్డారు. బీజేపీ నాయకురాలిగా గవర్నర్ పనిచేస్తుందని ఆయన విమర్శించారు. మొన్న ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో కూడా గవర్నర్ ఇష్టారాజ్యంగా ప్రవర్తించారని, దాసోజు శ్రావణ్, కుర్ర సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించటం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ప్రకటించుకుంటే ఆ ఫైల్ పెండింగ్ లో పెట్టి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ప్రవర్తించటం హేయమైన చర్య అని ఆయన అన్నారు.
Also Read : SSMB 29: రాజమౌళి ప్లేస్ లో రావిపూడి? మహేష్ సినిమాల విషయంలో అసలు ఏం జరుగుతోంది?
అపారమైన రాజకీయ అనుభవం, ప్రజా సేవ చేస్తున్న గిరిజన నేత కుర్ర సత్యనారాయణ, బీసీ నేత దాసోజు శ్రవణ్ లను అవమాన పరచటం ఘోరమన్నారు. బీజేపీ పార్టీకి అంటకాగుతూ కార్యకర్తగా పనిచేస్తున్న గవర్నర్ తమిళసై తన పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యే గా పోటీ చేయండని ఆయన అన్నారు. ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాలలో ఏమైనా లోపాలుంటే చెప్పండి.. వాటిని సవరించి పంపిస్తామని, కానీ.. రాష్ట్ర ప్రభుత్వంపై తమిళసై వ్యతిరేకధోరణి మానుకోవాలన్నారు గూడెం మహిపాల్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధిని చూడలేక బీజేపీ అండతో రహస్య అజెండాతో గవర్నర్ తమిళ సై నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర పురోగతికి గవర్నర్ తోడ్పడాలని, భారతదేశంలో తెలంగాణ ఒక మోడల్ రాష్ట్రంగా నిలబడుతుంది. అది చూడలేకనే అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆయన మండిపడ్డారు.
Also Read : Bigg Boss Telugu 7: శివాజీ పై సహనం కోల్పోయిన గౌతమ్.. ప్రశాంత్ కు వార్నింగ్ ఇచ్చిన అమర్..