LSG vs GT : మోహిత్ శర్మ స్వింగ్ తో గుజరాత్ టైటాన్స్ కింగ్ అయింది. అనూహ్యంగా ఓటమి నుంచి గెలుపు మజిలీకి చేరింది. అలవోకగా గెలవాల్సిన మ్యాచ్ ను లక్నో సూపర్ జెయింట్స్ వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు చేజార్చుకుని ఓటమిని చవిచూసింది. మొదట గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. కెప్టెన్ హార్థిక్ పాండ్యా ( 50 బంతుల్లో 66: 2 ఫోర్లు, 4 సిక్సులు), వృద్దిమాన్ సాహా ( 37బంతుల్లో 47: 6 ఫోర్లు) రాణించారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా, స్థొయినిస్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ ( 61 బంతుల్లో 68: 8 ఫోర్లు ) పోరాటం జట్టును గెలిపించలేకపోయింది. మోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. సాహాతో శుబ్ మన్ గిల్ ( 0 ) ఇంపాక్ట్ డకౌటైంది. వన్ డౌన్ లో కెప్టెన్ హార్థిక్ పాండ్యా అండగో సాహా బౌండరీలతో టైటాన్స్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
Also Read : Rahul Gandhi : రెండ్రోజుల పర్యటన నిమిత్తం నేడు కర్ణాటకు రాహుల్ గాంధీ
హార్థిక్ పాండ్యా, సాహా జోడీ పవర్ ప్లేలో 40 పరుగులు చేసింది. ఆ తర్వాత అడపాదడపా ఫోర్లతో 10 ఓవర్ల దాకా వికెట్ ను కాపాడుకున్నారు. జట్టు స్కోర్ 72 వద్ద సాహాను కృనాల్ పాండ్యా ఔట్ చేయగా.. తర్వాత వచ్చిన అభినవ్ ( 3 ), విజయ్ శంకర్ ( 10 ) నిరాశపరచడంతో పెద్ద స్కోరే చేయలేకపోయింది. ఆఖరి ఓవర్లలో హార్థిక్ భారీ సిక్సర్లతో స్కోర్ పెంచే ప్రయత్నం చేశాడు. 44 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న పాండ్యా ఆఖరి ఓవర్లలో అవుట్ అయ్యాడు. లక్నో ముందున్న లక్ష్యం 136 పరుగులు.. కష్టమైందో.. కఠినమైందో తెలియదు కానే కాదు..
Also Read : Akshaya Tritiya 2023 : అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి అమ్మవారి దర్శనం.. అష్టైశ్వర్య ప్రదాయకం
అయితే ఓపెనింగ్ జోడీ కెప్టెన్ రాహుల్, కైల్ మేయర్స్ ( 19 బంతుల్లో 24: 2 ఫోర్లు, 1 సిక్స్ ) పవర్ ప్లేలోనే 53 పరుగులు చేయడంతో లక్ష్య ఛేదన సులువుగా సాగింది. మేయర్స్ అవుట్ అయ్యాక కృనాల్ పాండ్యా ( 23 బంతుల్లో 23: 2 ఫోర్లు, సిక్స్ ) అవుటయ్యేసరికి జట్టు 100 పరుగుల మార్క్ దాటింది. నికోలస్ పూరన్ ( 1) విఫలమైనా.. రాహుల్ క్రీజును అట్టిపెట్టుకోవడంతో ఎవరికీ ఏ బెంగా లేకుండా ఉంది. రాహుల్ 38 బంతుల్లో అర్థశతనం సాధించాడు. ఆఖరి ఓవర్ కు ముందు 124/3 స్కోర్ తో లక్నో పటిష్టంగా ఉంది. కానీ ఆ తర్వాత మోహిత్ శర్మ చివరి ఓవర్ బౌలింగ్ కు వచ్చాడు. దీంతో కథ అక్కడ మారింది. పూర్తిగా ఫస్ట బాల్ కి 2 రెండు పరుగులు తీసిన రాహుల్ రెండో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకున్నాడు. దీంతో స్టోయినీస్ కూడా వచ్చి రాగానే షాట్ కొట్టి వికెట్ ను కోల్పోయాడు. పరుగుల వేటలో ఆయుష్ బదోని ( 8), దీపక్ హుడా ( 2) రనౌట్ అయ్యారు. అంతే గుజరాత్ టైటాన్స్ 7 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది.