Site icon NTV Telugu

IPL 2023 : గుజరాత్ టైటాన్స్ తో పంజాబ్ కింగ్స్ ఢీ..

Gt Vs Pbks

Gt Vs Pbks

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో కీలకమైన పోరుకు రెడీ అయ్యాయి.. గుజరాత్ టైటాన్స్-పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్లు.. ఇవాళ ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ కు కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. రింకూ సింగ్ అద్భుతమై బ్యాటింగ్ తో దుమ్మురేపాడు. గుజరాత్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. గాయం కారణంగా దూరమైన హార్థిక్ పాండ్యా ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండనున్నాడు. అయితే ఇవాళ జరిగే ఈ కీలక మ్యాచ్ కు పంజాబ్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం వేదిక అయింది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ మరింత ఆసక్తిరేపుతుంది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ ను 5 పరుగుల తేడాతో ఓడించిన పంజాబ్ కింగ్స్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కోలుకోలేని దెబ్బ కొట్టింది.

Read Also : Dasara: చిరు దెబ్బకి దసరా డైరెక్టర్ వీణ స్టెప్ వేస్తున్నాడు…

దీంతో ఇరు జట్లు విజయం కోసం హోరా హోరీగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో టాప్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ కొనసాగుతుండగా.. మ్యాచ్ ను ఏ మాత్రమ చేజార్చుకునేందుకు ఇష్టపడని తత్వం గుజరాత్ టైటాన్స్ ది. శిఖర్ ధావన్ వర్సెస్ హార్థిక్ పాండ్యా మధ్య జరిగే ఈ ఉత్కంఠ భరిత పోరులో ఎవరినీ విజయం వరిస్తోందో చూడాలంటే రాత్రి వరకు వేచి చూడాల్సిందే..

Read Also : Girl kidnapped Ex Boyfriend: ప్రియుడితో కలిసి ఎక్స్‌ లవర్‌ని కిడ్నాప్‌ చేసిన యువతి.. నగ్నంగా మార్చి చిత్ర హింసలు..!

Exit mobile version