Site icon NTV Telugu

GT vs LSG : 10 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ స్కోర్‌ ఇలా

Pandya

Pandya

ఐపీఎల్‌ 2023 సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. అయితే నేడు ఎకానా స్పోర్ట్జ్ సిటీ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో గుజరాత్‌ టైటాన్స్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న గుజరాత్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. కృనాల్‌ పాండ్యా వేసిన రెండో ఓవర్‌లోనే శుభ్‌మన్‌ గిల్‌ ఔట్‌ అయ్యి తొలి వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఆ తరువాత.. గుజ‌రాత్ ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసే సరికి.. రవి బిష్ణోయ్ వేసిన ఆరో ఓవ‌ర్‌లో సాహా రెండు ఫోర్లు కొట్ట‌డంతో 11 ప‌రుగులు వ‌చ్చాయి. ఇదేవిధంగా.. 10 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ వికెట్‌ నష్టానికి 71 పరుగులు చేసింది. హార్ధిక్ పాండ్యా(24), వృద్ధిమాన్ సాహా(47) క్రీజులో ఉన్నారు. గుజరాత్ టైటాన్స్‌ జట్టు బ్యాటింగ్‌లో తడబడుతున్నది. తొలి ఐదు ఓవర్లు ముగిసేసరికి కేవలం మూడు బౌండరీలు మాత్రమే రాబట్టింది. ఆ మూడు బౌండరీలను వృద్ధిమాన్‌ సాహా కొట్టాడు.

Exit mobile version