NTV Telugu Site icon

Online Games: ఇక ఫోన్లో గేమ్స్ ఆడాలన్నా పన్ను కట్టాల్సిందే..?

New Project (1)

New Project (1)

Online Games : ఆన్‌లైన్ గేమింగ్ ఆడే వారికి పెద్ద షాక్. ఆన్ లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందాల(జూదం)పై జీఎస్టీని భారీగా పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు వాటిపై 18 శాతం జీఎస్టీ ఉండగా.. దానిని 28 శాతానికి పెంచేందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రుల ప్యానెల్ ప్రతిపాదనను మే లేదా జూన్‌లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే నైపుణ్యతను పెంచే గేములపై జీఎస్టీ 18శాతంగా ఉండనుంది. ప్రస్తుతం ఆన్‌లైన్ గేమింగ్‌పై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. ఇది ఆన్‌లైన్ గేమింగ్ పోర్టల్ ద్వారా వసూలు చేయబడిన మొత్తం రుసుముపై ఉంటుంది.

Read Also: Heavy Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. వడగళ్ల వానలు కురిసే అవకాశం

గతంలోనే మేఘాలయ సీఎం సంగ్మా నేతృత్వంలోని మంత్రుల బృందం, గేమ్‌లో పాల్గొనడానికి ఆటగాడు చెల్లించే ప్రవేశ రుసుముతో సహా, ఆన్‌లైన్ గేమింగ్ పూర్తి విలువతో పన్ను విధించాలని సిఫార్సు చేసింది.. క్యాసినో, ఆన్‌లైన్‌ గేమింగ్‌, గుర్రపు పందాలపై 28 శాతం జీఎస్టీ విధించాలని సూచనలు చేసింది. రేస్ కోర్సుల విషయంలో, టోటలైసేటర్‌లలో పూల్ చేసి బుక్‌మేకర్‌ల వద్ద ఉంచిన బెట్టింగ్‌ల పూర్తి విలువపై జీఎస్టీ విధించాలని.. కాసినోలో ఒక ఆటగాడు కాసినో నుండి కొనుగోలు చేసిన నాణేల పూర్తి విలువపై పన్ను విధించాలని సిఫార్సు చేసింది మంత్రుల కమిటీ… మునుపటి రౌండ్‌లలో గెలిచిన వాటితో సహా, ప్రతి రౌండ్ బెట్టింగ్‌లో ఉంచిన బెట్టింగ్‌ల విలువపై జీఎస్టీ వర్తింపజేయాలని ప్రతినాదలను పంపారు.. అలాగే, కాసినోలలోకి ప్రవేశ రుసుములపై 28 శాతం వస్తువులు మరియు సేవల పన్ను విధించాలని, ఇందులో తప్పనిసరిగా ఆహారాలు/పానీయాలు మొదలైనవాటిని చేర్చాలని జీఎంవో సూచించింది.

Read Also:Manipur : సీఎం కార్యక్రమంలో గందరగోళం..వేదికకు నిప్పుపెట్టిన దుండగులు

రెండేళ్లలో 29,000 కోట్ల పరిశ్రమ
KPMG నివేదిక ప్రకారం, కరోనా లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ గేమింగ్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నివేదిక ప్రకారం, వచ్చే రెండేళ్లలో అంటే 2024-25 నాటికి దేశీయ ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ పరిమాణం రూ.29,000 కోట్లకు పెరగనుంది. 2021లో ఇది 13,600 కోట్లు.

Show comments