NTV Telugu Site icon

GST On EV Charging: ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను ఛార్జింగ్ చేస్తే జీఎస్టీ

Ev Charging

Ev Charging

పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ బ్యాటరీలకు ఛార్జింగ్ చేస్తే 18 శాతం చొప్పున జీఎస్టీ వర్తిస్తుందని కర్ణాటక అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ సంస్థ పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసే విషయాన్ని ఓ విద్యుత్‌ పంపిణీ సంస్థ అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ సంస్థ ముందుకు తీసుకు వెళ్లింది. ఇందు కోసం వాహనదారుల నుంచి పన్ను తోపాటు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఫీజును కూడా వసూలు చేయాలని అనుకుంటున్నట్లు తెలిపింది. ఇందులో ఎనర్జీ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు అనే రెండు భాగాలు ఉంటాయని వెల్లడించారు. ఎనర్జీ ఛార్జ్ అనేది వాహనదారులు వినియోగించే ఎనర్జీ యూనిట్ల సంఖ్యను ఇది సూచిస్తుంది.

Read Also: Gunturu Kaaram: మనలో మన మాట.. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందంటారా మాస్టరూ..?

ఇంధన ఛార్జీలను వస్తువుల సరఫరాగా పరిగణిస్తారా.. సేవల సరఫరాగా పరిగణిస్తారా అనేది ప్రాథమిక సమస్యగా తలెత్తింది. ఇందులో మొదటిది అయితే జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే, ఎలక్ట్రిక్‌ వెహికల్‌ చార్జింగ్‌ని విద్యుత్‌ సరఫరా కేటగిరి కింద పరిగణించాలా వద్దా అన్నది అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ ముందు ఉన్న సమస్య. ఎలక్ట్రిక్‌ వెహికల్‌ బ్యాటరీని ఛార్జ్ చేయడం అంటే విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా మార్చే ప్రక్రియ అని రూలింగ్‌ అథారిటీ పేర్కొనింది. విద్యుత్‌ అనేది వస్తువుగా వర్గీకరించిన చరాస్తి.. దాన్ని అలాగే కాకుండా బ్యాటరీల్లో రసాయన శక్తిగా మార్చి వినియోగదారులకు అందిస్తున్నారని అడ్వాన్స్‌ రూలింగ్‌ సంస్థ వెల్లడించింది.

Read Also: Ponnam Prabhakar: అసంతృప్తిలో పొన్నం ప్రభాకర్.. కారణం అదే!

ఈ సందర్భంగా అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక వివరణను కూడా ప్రస్తావిస్తూ.. ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ఛార్జింగ్‌ అనేది విద్యుత్‌ అమ్మకం కిందకు రాదని, దాన్ని సర్వీస్‌ కిందే పరిగణించాలని క్లారిటీ ఇచ్చింది. విద్యుత్‌ సరఫరా, సర్వీస్ ఛార్జీలను సర్వీస్ సప్లయిగా పరిగణించాలి, కాబట్టి 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని తీర్మానించింది.