Site icon NTV Telugu

GST Officer Kidnapped: హైదరాబాద్ లో జీఎస్టీ ఆఫీసర్ కిడ్నాప్.. పోలీసులు ఏం చేశారంటే..!

Gst Officer

Gst Officer

హైదరాబాద్‌లో షాకింగ్‌ ఘటన జరిగింది. సరూర్‌ నగర్‌లో జీఎస్టీ సీనియర్‌ అధికారిపై దాడి చేసి అతడిని కిడ్నాప్‌ చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ క్రమంలో పోలీసులు కిడ్నాప్‌ను చేధించారు. సరూర్‌ నగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జీఎస్టీ సీనియర్‌ అధికారి మణిశర్మ కిడ్నాప్‌ చేశారు. అయితే, దిల్‌షుక్‌నగర్‌లోని కృష్ణానగర్‌లో ఓ షాప్‌ను జీఎస్టీ కట్టకపోవడంతో సీజ్‌ చేసేందుకు ఆఫీసర్‌ మణిశర్మ అక్కడికి వెళ్లాడు. ఈ సందర్భంగా ఆఫీసర్‌ మణిశర్మ, మరో అధికారి ఆనంద్‌లను షాప్‌ ఓనర్‌ సహా మరో ముగ్గురు కలిసి కిడ్నాప్‌ చేశారు. జీఎస్టీ ఆఫీసర్‌పై వారు దాడి కూడా చేశారు.

Read Also: Minakshi Chaudhary: పలుచటి డ్రెస్ లో స్టన్నింగ్ పోజులతో రెచ్చగొడుతున్న మీనాక్షి..

ఇక, కిడ్నాప్‌ సమయంలో నిందితులు వాడిన కారుపై టీడీపీ నేత ముజీబ్‌ పేరుతో స్టికర్‌ ఉండటంతో పలు అనుమానాలకు దారి తీస్తుంది. నిందితుల్లో టీడీపీ నేత ముజీబ్‌ అనుచరులు ఉన్నట్టు సమాచారం. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ముజీబ్‌. దీంతో ఈ విషయం పోలీసులకు తెలియడంతో రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా కిడ్నాప్‌ కు పాల్పడిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం, నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

Read Also: World Hottest Day: భూమిపైనే అత్యంత వేడి రోజు.. ఉష్ణోగ్రత ఎంతో తెలుసా?

అయితే, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద నిందితులు నలుగురు వీరంగం సృష్టించారు. మమ్మల్ని కావాలని అరెస్ట్ చేసి.. మా పై అక్రమ కేసులు పెడుతున్నారు అని నిందితులు ఆరోపించారు. దీంతో నలుగురిని రిమాండ్ కు పోలీసులు తరలించారు. అయితే, ఫేక్ జీఎస్టీ ఉన్న షాప్ ను సీజ్ చేసేందుకు GST అధికారులు వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నాము అని ఎల్బీ నగర్ డీసీపీ సాయి శ్రీ తెలిపింది.

Exit mobile version