NTV Telugu Site icon

Group 4 Results: తెలంగాణలో గ్రూప్-4 రిజల్ట్స్ విడుదల.. వెబ్సైట్ ఓపెన్ కాక తీవ్ర ఇబ్బందులు

Tspsc

Tspsc

తెలంగాణలో గ్రూప్‌-4 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థుల ర్యాంకుల లిస్ట్ ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) వెల్లడించింది. గతేడాది జూలైలో గ్రూప్-4 పరీక్షలను టీఎస్పీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. 8,810 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా.. 7 లక్షల 26 వేల 837 మంది అభ్యర్థుల ర్యాంకింగ్ లను ప్రకటించింది. అభ్యర్థులు తమ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in/లో ర్యాంకులు చూసుకోవాలని సూచించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం సెలక్ట్ అయిన వారి షార్ట్ లిస్ట్ ను తరవాత ప్రకటిస్తామని తెలిపింది. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 80శాతం మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు.

Off the Record: బీజేపీకి మాజీ మంత్రి రాజీనామా.. మరి అడుగులు ఎటువైపు..?

కాగా.. గ్రూప్‌-4 ఫలితాలు విడుదలవడంతో వెబ్ సైట్ క్రాష్ అయింది. వెబ్ సైట్ ఓపెన్ కాకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా.. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

Allahabad HC: కూతురు ప్రేమ వివాహాన్ని వ్యతిరేకిస్తూ తల్లిదండ్రుల కేసు.. హైకోర్టు ఏం చెప్పిందంటే..?