Site icon NTV Telugu

Group 2 Reschedule : గ్రూప్‌-2 రీషెడ్యూల్‌.. కొత్త డేట్లను ప్రకటించిన TSPSC

Group 2

Group 2

ఈ నెలాఖరున నిర్వహించాల్సిన గ్రూప్ 2 పరీక్షను నవంబర్ 2, నవంబర్ 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఆదివారం వెల్లడించింది. టీఎస్పీ్ఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం పరీక్షలు ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో జరుగుతాయి. అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను TSPSC వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి, పరీక్ష తేదీలకు వారం ముందు, నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది.

Also Read : Prashant Kishore: ఆ సీఎంకు చదువు రాదు.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఘాటు వ్యాఖ్యలు

కమీషన్‌తో సంప్రదింపులు జరిపి గ్రూప్-2 పరీక్షను రీషెడ్యూల్ చేసి అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చీఫ్ సెక్రటరీ ఎ శాంతికుమారిని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటన తెలిపింది. అయితే.. ఈనెల 29, 30వ తేదీల్లో జరుగాల్సిన గ్రూపు-2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే. అంతకుముందు అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ సీఎస్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు శనివారం రాత్రి ప్రకటించారు. తాజాగా.. పరీక్ష తేదీలను రీ షెడ్యూల్ చేస్తూ టీఎస్‌పీఎస్‌సీ అధికారులు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో గ్రూప్‌-2 కింద 783 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్‌ 29న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Also Read : TTD: టీటీడీ కీలక నిర్ణయం.. 15 ఏళ్ల లోపు చిన్నారులకు మధ్యాహ్నం 2 వరకే అనుమతి

Exit mobile version