NTV Telugu Site icon

UP : చపాతీలు లేటుగా పెట్టారని పెళ్లి నుంచి వెళ్లిపోయి వేరే అమ్మాయిని చేసుకున్న వరుడు

New Project 2024 12 28t133853.624

New Project 2024 12 28t133853.624

UP : ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక వరుడు పెళ్లికి వచ్చిన అతిథులకు రోటీని ఆలస్యంగా అందించినందుకు వివాహం చేసుకునేందుకు నిరాకరించాడు. ఇక్కడితో ఆగకుండా అదే రోజు రాత్రి మరో అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ విషయం వధువుకు తెలియడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె కలలన్నీ చెదిరిపోయాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఎస్పీ ఆదిత్య లాంఘేకు వధువు ఫిర్యాదు చేసింది. ఏడుస్తున్న వధువు తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు రంగంలోకి దిగి శుక్రవారం పోలీసుల సమక్షంలో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. ఈ విషయం జిల్లాలోని మొగల్‌సరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండస్ట్రియల్ టౌన్ చౌకీ ప్రాంతానికి చెందిన హమీద్‌పూర్‌కు సంబంధించినది. ఈ ఘటనపై బాధిత వధువు మాట్లాడుతూ.. అదే గ్రామానికి చెందిన మహతాబ్ అనే వ్యక్తితో ఏడు నెలల క్రితమే తన వివాహం నిశ్చయించుకున్నట్లు తెలిపారు. డిసెంబర్ 22న పెళ్లి జరగాల్సి ఉంది.

Read Also:Manmohan Singh Last Rites: ముగిసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

పెళ్లికి కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారని వధువు తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఊరేగింపు వచ్చింది. అందరికీ స్వాగతం పలికారు. అయితే, విందులో ఒక అతిథి రొట్టె ఆలస్యం అవుతుందని చెప్పి రచ్చ సృష్టించడం ప్రారంభించారు. ఇది విన్న తర్వాత ఇతర వ్యక్తులకు కూడా కోపం వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం కుటుంబ సభ్యులు అందరికీ వివరించినా వారు అంగీకరించలేదు. దీంతో వరుడు కూడా ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వరుడు వెళ్లిపోయిన తర్వాత పెళ్లి ఊరేగింపు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది. అదే రోజు రాత్రి వరుడికి గ్రామంలోని బంధువుల కుమార్తెతో వివాహం జరిగిందని వధువు ఆరోపించింది.

Read Also: Bellamkonda : భైరవం ఫిబ్రవరి రిలిజ్ డేట్ లాక్..?

ఈ ఘటనతో వధువు కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఎస్పీ కార్యాలయానికి చేరుకుని తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. పెళ్లి ఊరేగింపుకు రెండు వందల మంది వచ్చినట్లు బాధిత కుటుంబీకులు చెబుతున్నారు. వారికి భోజన ఖర్చుల నిమిత్తం చాలా డబ్బులు వ్యయం చేశారు. దీంతో పాటు వరుడికి రూ.1.5 లక్షలు కట్నంగా ఇచ్చారు. మొత్తం రూ.6-7 లక్షల నష్టం వాటిల్లిందని అంటున్నారు. అయితే ఫిర్యాదు అందడంతో ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిరింది.

Show comments