NTV Telugu Site icon

Minister Ramprasad Reddy: ప్రతి తహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదుల బాక్స్.. ప్రతి ఒక్కరికి న్యాయం చేసేలా కృషి..

Minister Ramprasad Reddy

Minister Ramprasad Reddy

Minister Ramprasad Reddy: ప్రతి తహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేస్తున్నాం.. ఫిర్యాదులు చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసేలా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాయచోటి నియోజకవర్గంలో 2000 కోట్లు విలువ చేసే భూములను వైసీపీ నేతలు కబ్జా చేశారని ఆరోపించారు.. భూ ఆక్రమణలపై మండిపడ్డ మంత్రి.. టీడీపీ ఇచ్చిన హామీల మేరకు పేదల, ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం అన్నారు. సంబేపల్లి మండలంలో వంకపొరం పోడు భూముల ను ఆక్రమించి వైసీపీ నేతలు కోట్లు దండుకుంటున్నారని విమర్శించారు.. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు రెవెన్యూ రికార్డులను సైతం ట్యాంపరింగ్ చేశారన్నారు. అయితే, టీడీపీ కక్ష కట్టి ఎటువంటి చర్యలు తీసుకోదు అని స్పష్టం చేశారు.

Read Also: AP Assembly Session: అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైన ప్రభుత్వం.. పూర్తిస్థాయి బడ్జెట్‌ లేనట్టే..!?

జిల్లాలో ఆక్రమణకు గురైన భూములపై కలెక్టర్ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. భూ బకాసురుల చేతిలో ఉన్న ఆక్రమిత భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలన్న ఆయన.. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.. ప్రజల నుంచి భూములు ఆక్రమించిన వారి వద్ద నుంచి వాటిని స్వాధీనం చేసుకుని ప్రజలకు ఇవ్వాలన్నారు.. ప్రజలెవరు ఇకనుంచి బాధపడాల్సిన అవసరం లేదు.. ప్రతి తహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదుల బాక్సులు పెడతాం.. ఫిర్యాదులు చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసేలా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి.