NTV Telugu Site icon

TSRTC: రేపటి నుంచి హైదరాబాద్ లో గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సులు పరుగులు

Tsrtc

Tsrtc

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన బ‌స్సుల‌ను టీఎస్ఆర్టీసీ తీసుకు వచ్చే దిశగా అడుగులు వేస్తుంది. న‌గ‌ర‌వాసుల కోసం నూత‌నంగా “గ్రీన్ మెట్రో లగ్జరీ” ఏసీ బ‌స్సుల్ని అందుబాటులోకి తీసుకొస్తోంది చెప్పుకొచ్చింది. రేపటి నుంచే ఈ బ‌స్సులు న‌గ‌రంలో ప‌రుగులు తీయ‌నున్నాయి. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ స‌ర్వీసుల్లో మొద‌టి విడ‌త‌గా 25 బ‌స్సులు రానున్నాయి. రేపు (20వ తారీఖు) ఈ బ‌స్సుల్ని రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ గ‌చ్చిబౌలి స్టేడియం దగ్గర ప్రారంభించ‌నున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, ఎండీ సజ్జనార్ పాల్గొననున్నారు.

Read Also: Tapsee Pannu: లగ్జరీ కారు కొన్న సొట్టబుగ్గల సుందరి.. రేటు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే

పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రయాణీలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించ‌నున్నాయ‌ని ఆర్టీసీ తెలిపింది. మిగిలిన 25 బ‌స్సులు న‌వంబ‌రు నాటికి అందుబాటులోకి వస్తాయని టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. ఈ బ‌స్సులు వంద శాతం వాయు కాలుష్యాన్ని వెదజల్లవు, ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే.. 225 కిలోమీటర్లు ప్రయాణించే సౌలభ్యం ఉంటుందని తెలిపింది. 3 గంట‌ల‌ నుంచి 4 గంటల లోపు వంద శాతం పూర్తి ఛార్జింగ్ అవ్వడమే కాకుండా క్యాబిన్ , సెలూన్‌లో రెండు చోట్ల సెక్యూరిటీ కెమెరాలు, ఒక నెల బ్యాకప్ స‌దుపాయం ఉంది.

Read Also: Harassment: సైకిల్పై వెళ్తున్న విద్యార్థినిపై వేధింపులు.. ఆ తర్వాత ఏమైందంటే..?

గ్రీన్ లగ్జరీ ఏసీ బస్సుల ప్రత్యేకతలివే..
12 మీటర్ల పొడవు గల ఈ గ్రీన్ లగ్జరీ ఏసీ బస్సులు అత్యాధునిక సౌక‌ర్యాల‌తో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. 35 సీట్ల సామర్థ్యం గ‌ల ఈ బస్సుల్లో ప్రతి సీటు దగ్గర మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు రీడిండ్‌ ల్యాంప్‌ లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు ప్రతి సీటు దగ్గర పానిక్‌ బటన్‌ సదుపాయం ఉంటుంది. వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూమ్ కు అనుసంధానం చేశారు. ప్రతి బస్సులోనూ 2 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్‌ బ్యాకప్‌ ఉంటుంది. బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా.. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిపిస్తాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం బస్సుల్లో ఉంది.