NTV Telugu Site icon

PM Modi US Visit: బైడెన్ దంపతులకు ప్రధాని మోడీ గిప్ట్స్.. స్పెషల్ అట్రాక్షన్‌గా గ్రీన్ డైమండ్..

Pm Modi

Pm Modi

PM Modi US Visit: ప్రధాని నరేంద్రమోడీ మూడు రోజుల అమెరికా పర్యటనలో బిజీబీజీగా గడుపుతున్నారు. ఆయనకు ప్రెసిడెంట్ జోబైడెన్, అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ లు వైట్ హౌజులోకి ఘన స్వాగతం పలికారు. అక్కడే మోడీకి బైడెన్ దంపతులు దేశం తరుపున విందు ఇచ్చారు. ఇరు నేతలు కూడా పరస్పరం బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రధాని మోడీ, జోబైడెన్ కు చేతితో చేసిన అందమైన గంధపు చెక్క పెట్టెను బహూకరించారు. కర్ణాటక మైసూర్ ప్రాంతానికి చెందిన గంధపు చెట్ల నుంచి తీసిన చెక్కతో దీన్ని తయారు చేశారు.

Read Also: Assam Floods: అస్సాంలో వరదలు.. 20 జిల్లాల్లో 1.20 లక్షల మందిపై ప్రభావం..

ఈ గంధపు పెట్టెలో పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన కళాకారులు ఎంతో సున్నితంగా తయారు చేసి వెండి వెండి వస్తువులు ఉన్నాయి. పెట్టెలో వినాయకుడి వెండి విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని కోల్‌కతాకు చెందిన ఐదవ తరానికి చెందిన వెండి కళాకారుల కుటుంబం చేతితో తయారు చేసింది. పెట్టెలో 99.5% స్వచ్ఛమైన మరియు హాల్‌మార్క్ ఉన్న వెండి నాణెం కూడా ఉంది. దీన్ని రాజస్థాన్ కళాకారులు తీర్చిదిద్దారు. బైడెన్ సతీమణి జిల్ బైడెన్ కి ప్రధాని గ్రీన్ డైమండ్ ను గిఫ్టుగా ఇచ్చారు. 7.5 క్యారెట్ల ఉన్న వజ్రాన్ని ‘కర్-ఎ-కలమ్‌దానీ’ పెట్టెలో ఉంచి అందించారు. ఈ పెట్టెని కాశ్మీర్ పేపియర్ మాచే కాగితపు గుజ్జు, నకాషీ సక్త్‌సాజియర్ తో అందంగా తీర్చిదిద్దారు.

అంతకుముందు ప్రధాని మోడీకి అధికారిక బహుమతిగా 20వ శతాబ్దం ప్రారంభంలో చేతితో తయారు చేసిన, పురాతన అమెరికన్ బుక్ గ్యాలీని అధ్యక్షుడు జో బైడెన్ అతని సతీమణి జిల్ బైడెన్ అందించనున్నారు. దీంతో పాటు పురాత అమెరికన్ కెమెరాను బహుమతిగా అందచేయనున్నారు. వీటితో పాటు జార్జ్ ఈస్ట్‌మన్ మొదటి కొడాక్ కెమెరాకు సంబంధించిన పేటెంట్ యొక్క ఆర్కైవల్ ఫాక్సిమైల్ ప్రింట్, అమెరికన్ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన హార్డ్‌కవర్ పుస్తకాన్ని కూడా బహుమతిగా అందజేస్తారు