Site icon NTV Telugu

Bribe: లంచం తీసుకుని బుక్కయ్యారు.. డబ్బు ఆశతో సస్పెండ్ అయిన డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్

Police

Police

అధికారం చేతులో ఉంది కదా.. ఆటలాడుకున్నారు ఆ పోలీసులు. కంచే చేను మేసింది అనే విధంగా నడుచుకున్నారు. ఇల్లీగల్ మనీ ఉంటే దాన్ని నిర్ధారించి కేసు బుక్ చేయాల్సింది పోయి.. విడిచి పెట్టేందుకు లంచం తీసుకుని అడ్డంగా బుక్కయ్యారు. ఉన్నతాధికారులకు విషయం తెలియడంతో సస్పెండ్ అయ్యారు. కట్టల కొద్దీ డబ్బు చూసి ఆశ పెరిగింది..కట్టల కొద్దీ డబ్బులు చూసి వారిలో ఆశ పెరిగింది.. కోట్లు కళ్ల ముందు ఉండడంతో రూల్స్ పక్కకు పెట్టేశారు.కోట్ల రూపాయలు కళ్ల ముందు కనబడడంతో రూల్స్ పక్కకు పేట్టేశారు..నీకింత… నాకింత అంటూ వాటాలు. నీకింత… నాకింత అంటూ వాటాలు వేసుకుని.. కంచే చేను మేసిన విధంగా పంచేసుకున్నారు..సీన్ కట్ చేస్తే.. ఉన్నతాధికారులు ఆ పోలీసులకు సస్పెన్షన్ షాక్ ఇచ్చారు.. మహంకాళి పోలీస్టేషన్‌లో డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్‌
డబ్బు ఆశతో తప్పటడుగు వేశారు.ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వై. కేసరి ప్రసాద్. సికింద్రాబాద్ మహంకాళి పోలీస్టేషన్‌లో డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్‌గా పని చేస్తున్నాడు. పేరుకు తగ్గట్టే ఆయన భగవంత్ కేసరి టైప్. ఎన్నో కేసులు డిటెక్ట్ చెసి ప్రెస్ మీట్‌లు పెట్టారాయన. కానీ అలాంటి అధికారి డబ్బు ఆశతో తప్పటడుగు వేశారు. సస్పెండయ్యారు..వాహనాల తనిఖీల్లో భాగంగా భారీగా బంగారం గుర్తింపు. మహంకాళి పోలీస్టేషన్ పరిధిలో చాలా వరకు బంగారం షాపులు ఉన్నాయి. నిత్యం కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో డీఐ కేసరి ప్రసాద్ వెంట ఉండే క్రైం టీం కానిస్టేబుళ్లు వాహనాల తనిఖీల్లో భాగంగా భారీగా బంగారంను గుర్తించారు. కోట్ల రూపాయల డబ్బుతో పాటు బంగారం చేతులు మారుతుందని తెలుసుకున్నారు. నగదును పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. ఈ విషయాన్ని డీఐ ప్రసాద్‌కు సమాచారం ఇచ్చారు.

మరోవైపు బంగారం, కోటి రూపాయల డబ్బు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకోవద్దని వ్యాపారి కానిస్టేబుళ్లను బతిమిలాడుకున్నాడు. అంతే కాదు వాటికి తగిన ఆధారాలు చూపిస్తానని చెప్పాడు. కానీ అందుకు ఒప్పుకోని కానిస్టేబుళ్లు.. ఇది హవాలా వ్యాపారం.. దానికి తగిన విధంగా కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. హవాలా కేసు అనగానే భయపడ్డ వ్యాపారి కాళ్ల బేరానికి వచ్చాడు. వారు అడిగిన విధంగా డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. దీంతో.. తిరిగి డీఐ ప్రసాద్‌కు కాల్ చేసిన కానిస్టేబుళ్లు.. ఓ డీల్ కుదిర్చారు. వ్యాపారి రూ. 10 లక్షలు ఇస్తాడని ఆయనతో చెప్పారు…

కానిస్టేబుల్ మాటలు విని ఒప్పుకున్న డీఐ ప్రసాద్.. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరారు. కానీ పట్టుకున్న డబ్బు నుంచి కాకుండా అకౌంట్ ద్వారా రూ. 6 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. ఆ డబ్బును డీఐ ప్రసాద్‌తోపాటు కానిస్టేబుళ్లు పంచుకున్నారు. అంతే కాదు మిగతా రూ. 4 లక్షల కోసం వ్యాపారిని బెదిరించారు. దీంతో ఆ వ్యాపారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసిన ఆధారాలు కూడా సమర్పించాడు. ఫలితంగా డీఐ సహా ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది… గతంలో ఎన్నో కేసులు పరిష్కరించి మంచి పేరు తెచ్చుకున్న డీఐ ప్రసాద్.. ఇప్పుడు కాసుల కక్కుర్తితో సస్పెండ్ కావాల్సి వచ్చింది…

Exit mobile version