NTV Telugu Site icon

IND-W vs UAE-W: యూఏఈపై ఇండియా ఘన విజయం.. సెమీస్కు భారత్

Ind

Ind

శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2024లో భారత్ ఘన విజయం సాధించింది. యూఏఈపై 78 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదటగా బ్యాటింగ్ చేసిన భారత్ 201 పరుగులు చేయగా.. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. యూఏఈ బ్యాటింగ్లో అత్యధికంగా కవిషా ఎగోడాగే (40*) పరుగులు చేసింది. ఆ తర్వాత ఇషా ఓజా (38) పరుగులు సాధించింది. ఖుషీ శర్మ (10) రన్స్ చేసింది. మిగత బ్యాటర్లందరూ కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో జట్టు విజయం సాధించింది. భారత్ బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు తీసింది. ఆ తర్వాత రేణుకా సింగ్, తనుజా కన్వార్, పూజా వస్త్రాకర్, రాధ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.

Read Also: Uttarakhand HC: భార్యతో బలవంతంగా అసహజ శృంగారానికి పాల్పడిన భర్తను శిక్షించొచ్చా..? హైకోర్టు ఏం చెప్పిందంటే..

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ (37), స్మృతి మంధాన (13) పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత దయాళన్ హేమలత (2) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టింది. తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ (66), రిచా ఘోష్ (64) పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్ స్కోరును పెంచారు. హర్మన్ ప్రీత్ ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. రిచా ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. ఆ తర్వాత.. జెమీమా రోడ్రిగ్స్ (14) పరుగులు చేయడంతో భారత్ 201 పరుగుల భారీ స్కోరు చేసింది. యూఏఈ బౌలర్లలో కవిషా 2 వికెట్లు పడగొట్టింది. సమైరా, హీనా చెరో వికెట్ తీశారు. కాగా.. భారత్ ఈ మ్యాచ్ విజయంతో సెమీఫైనల్కు చేరుకుంటుంది.

Read Also: Viral Video: అసలు ఎలా వస్తయో ఇలాంటి ఐడియాలు.. మీరూ ట్రై చేస్తే పోలా..