NTV Telugu Site icon

Illegal registration : రైతుబంధు ఇప్పిస్తానని చెప్పి.. నానమ్మ భూమి కాజేసిన మనవడు

Registrastion

Registrastion

రైతు బంధు పేరుతో సొంత నానమ్మ భూమినే కాజేశాడు ఓ మనువడు. మాయమాటలు చెప్పి వృద్ధురాలిని మోసం చేసి ఎకరం భూమిని తన పేరుమీదకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.

Also Read : Bhatti Vikramarka : ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే నిర్బంధం: భట్టి విక్రమార్క

జగిత్యాల జిల్లా కొడిమ్మాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన నీలగిరి అమ్మాయి అనే వృద్ధురాలుకి రెండు ఎకరాల భూమి ఉంది. అయితే గతంలో ఒక ఎకరం భూమిని వృద్ధురాలు తన కొడుకు పేరు మీద పట్టా చేసింది. తన పేరుమీద ఓ ఎకరం భూమిని రిజిస్టేషన్ చేయించుకుంది. అయితే నానమ్మ భూమిపై మనుమడు రామేశ్వర్ కన్నేశాడు.

Also Read : Viral Video: ఫుల్‌గా మందేశాడు.. ఎద్దును ఎక్కి స్వారీ చేశాడు..

ఐదు నెలల కింద రైతుబంధు డబ్బులు ఇప్పిస్తానని నానమ్మకు రామేశ్వర్ అబద్దాలు చెప్పాడు. అది నమ్మిన నీలగిరి అమ్మాయి మనుమడితో ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లింది. దీంతో ఆమె పేరుపై ఉన్న ఎకరం ల్యాండ్ ని అక్రమంగా తన పేరు మీదకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మనవడు చెప్పిన చోటల్లా వృద్ధురాలు సంతకం పెట్టింది. దీంతో ఆమె పేరు మీద ఉన్న భూమి రామేశ్వర్ పేరు మీద రిజిస్ట్రర్ అయింది.

Also Read : Cyclone Mocha: దిశ మార్చుకున్న “మోచా తుఫాను”.. బంగ్లాదేశ్-మయన్మార్ వైపు కదలిక

అయితే చాలా రోజుల కావడంతో మనవడు ఇప్పిస్తానన్న రైతుబంధు డబ్బులు రాకపోవడంతో వృద్ధురాలు.. ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లి ఆరా తీసింది. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. తన భూమిని మనవడే లాగేసుకున్నాడని ఆర్డీవో దగ్గరకు వెళ్లి మోరపెట్టుకోవడంతో.. భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని గ్రహించిన ఆర్డీవో.. కొడిమ్యాల తహసీల్దార్ కు ఫోన్ చేసి విషయాన్ని వివరించారు. నీలగిరి అమ్మాయి పేరు తరపున ఉన్న భూమి రిజిస్ట్రేషన్ ను హోల్డ్ లో పెట్టమని ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలు ఫిర్యాదుతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన రామేశ్వర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.