కొత్త రేషన్ కార్డుల మంజూరీపై తెలంగాణ ప్రభుత్వం కీలక సమాచారం ఇచ్చింది. కొత్త రేషన్ కార్డుల మంజూరీ పై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయింది. ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉప సంఘం సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహా పాల్గొన్నారు. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది.
Read Also: Himanta Biswa Sarma: హిందూ జనాభా తగ్గింది.. అస్సాం, బెంగాల్, జార్ఖండ్‌లో ఇదే పరిస్థితి..
గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్షన్నర, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు కలిగి ఉన్న వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని తెలిపింది. అలాగే.. పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలు ఉండాని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో భూములను కాకుండా వార్షిక ఆదాయాన్ని ఆధారంగా రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి వర్గ ఉపసంఘం భేటీలో తెలిపింది. ఈ విషయంలో విధి, విధినాల రూపకల్పనలో రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలన్నారు. లోక్ సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. వారందరికీ సమాచారం చేరేలా లేఖలు రాయండి.. సక్సేనా కమిటీ సిఫారసుల పరిశీలన చేయాలన్నారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలలో తెల్లరేషన్ కార్డుల అర్హత ప్రమాణాలు పరిశీలన చేయాలని పేర్కొన్నారు. అదే విధంగా.. అంతర్ రాష్ట్రాలలో తెల్ల రేషన్ కార్డు ఉండి ఇక్కడా ఉంటే ఏరివేత ఉంటుందని మంత్రివర్గ ఉప సంఘం తెలిపింది.
Read Also: David Rush: ఒకే రోజు 15 వరల్డ్ గిన్నిస్ రికార్డ్‌లు బద్ధలు కొట్టిన అమెరికన్