Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Iifcl Recruitment 2026 Assistant Manager Manager Vacancy Apply Online

Govt Jobs: నిరుద్యోగులకు తీపి కబురు.. IIFCLలో ఉద్యోగాలు..

Published Date :March 18, 2026 , 4:27 pm
By Veerababu
  • నిరుద్యోగులకు శుభవార్త..
  • ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..
  • నెలకు వేతనం రూ.55 వేలకుపైన..
Govt Jobs: నిరుద్యోగులకు తీపి కబురు.. IIFCLలో ఉద్యోగాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (IIFCL) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో గ్రేడ్ ఏ, గ్రేడ్ బీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 37 ఖాళీలను ప్రకటించగా.. అందులో 33 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, 4 మేనేజర్ పోస్టులు ఉన్నాయి.

ఈ నియామకాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 18, 2026 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 10, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించబడుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని.. అవసరమైన వివరాలను నమోదు చేసి ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.

Also Read:Oppo A6s 5G: భారత్‌లో Oppo A6s 5G లాంచ్.. 6,500mAh బ్యాటరీ, Dimensity 6300, 50MP కెమెరా.. ధర ఎంతంటే?

ఎంపిక ప్రక్రియను పలు దశలుగా నిర్వహిస్తారు. మొదట స్క్రీనింగ్ జరుగుతుంది. అనంతరం రాత పరీక్ష, టెక్నికల్ లేదా బిహేవియరల్ అప్రైజల్, చివరగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థుల సామర్థ్యాన్ని అన్ని కోణాల్లో అంచనా వేసి తుది ఎంపిక చేస్తారు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రాత పరీక్షలో రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్‌తో పాటు సంబంధిత విభాగానికి చెందిన డొమైన్ నాలెడ్జ్‌పై ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్ష రెండు భాగాలుగా ఉంటుంది.

జీతభత్యాల విషయానికి వస్తే.. మేనేజర్ (Grade B) పోస్టులకు ప్రారంభ వేతనం సుమారు రూ.55,200గా ఉండగా.. వార్షిక CTC సుమారు రూ.23.5 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ సంస్థ కావడంతో ఇతర అలవెన్సులు, సౌకర్యాలు కూడా లభిస్తాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు దీర్ఘకాలిక ఆర్థిక సహాయం అందించే కీలక సంస్థగా IIFCL దేశ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. అలాంటి సంస్థలో ఉద్యోగం సాధించడం యువతకు మంచి అవకాశంగా భావించవచ్చు.

అయితే.. ఖాళీలు తక్కువగా ఉండటం వల్ల పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు చివరి తేదీ కోసం వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది. అలాగే అర్హతలు, అవసరమైన పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • central government jobs
  • Finance Jobs India
  • Government Jobs India 2026
  • IIFCL Apply Online
  • IIFCL Assistant Manager Jobs

తాజావార్తలు

  • Govt Jobs: నిరుద్యోగులకు తీపి కబురు.. IIFCLలో ఉద్యోగాలు..

  • Pakistan Crisis: పాకిస్థాన్‌పై ముప్పేట దాడి.. నూనె లేదు, పిండి లేదు.. తీవ్ర సంక్షోభంలో దాయాది దేశం..

  • Oppo A6s 5G: భారత్‌లో Oppo A6s 5G లాంచ్.. 6,500mAh బ్యాటరీ, Dimensity 6300, 50MP కెమెరా.. ధర ఎంతంటే?

  • Stock Market: మార్కెట్‌కు లాభాల పంట.. వరుస జోరుకు కారణమిదేనా?

  • OnePlus Pad 3 Pro: 13.2-అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, 16GB RAMతో.. వన్‌ప్లస్ కొత్త టాబ్లెట్

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions