Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్.. మరోసారి పొడిగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి ఆశాభంగమే ఎదురైంది. వేతన సవరణ కోసం ఎదురుచూస్తున్న వారికి తక్షణ ఉపశమనం లభించకపోగా.. ప్రభుత్వం పీఆర్‌సీ (Pay Revision Commission) గడువును మళ్లీ పొడిగించింది. అసలు ఈ కమిటీ గడువు మార్చి 31తో ముగియాల్సి ఉండగా.. తాజాగా దాన్ని సెప్టెంబర్ చివరి వరకు ఆరు నెలలు పెంచే నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త వేతనాల అమలు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగులు కొత్త పీఆర్‌సీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటివరకు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించలేదు. దీంతో ఉద్యోగ సంఘాలు పలుమార్లు ప్రభుత్వాన్ని కలిసి తమ సమస్యలను వివరించాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయాల కారణంగా ప్రస్తుతం ఉన్న జీతాలు సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. ఎన్నికల సమయంలో మూడు నెలల్లో కొత్త పీఆర్‌సీ అమలు చేస్తామని ఇచ్చిన హామీపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేత హరీశ్ రావు, ఇంతకాలం ఆలస్యం ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తూ, కనీసం ఇప్పటికైనా నివేదిక తీసుకుని అమలు తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Also Read
- Netanyahu at UN: నెతన్యాహూ చేతిలో ‘‘పేజర్’’.. ఏడు వైపుల యుద్ధం చేశామన్న ఇజ్రాయిల్..
- Banks-Government: బ్యాంక్‌ల డిమాండ్లకు ససేమిరా.. కేంద్రం ఏం చెబుతుందంటే..!
- Afg Vs Nepal: ఏంది సామీ ఆ ఆట.. ఆఫ్ఘనిస్థాన్‌ను చుట్టేసిన నేపాల్ జట్టు.. కుమ్మేసిన పసికూన..
- Iran: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు.. కవల సోదరీమణుల్లో ఒకరికి మరణశిక్ష మరొకరికి 27 ఏళ్ల జైలు!
Also Read:GST Scam: రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం బట్ట బయలు.. తెలుగు రాష్ట్రాలలో 72 షెల్ కంపెనీలు గుర్తింపు..!
అయితే ప్రభుత్వం మాత్రం త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం కన్నా కమిటీకి మరింత సమయం ఇవ్వడానికే మొగ్గు చూపింది. దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. కొత్త పీఆర్‌సీ అమలు ఎప్పుడవుతుందనే దానిపై స్పష్టత రావాల్సిన అవసరం మరింత పెరిగింది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Netanyahu at UN: నెతన్యాహూ చేతిలో ‘‘పేజర్’’.. ఏడు వైపుల యుద్ధం చేశామన్న ఇజ్రాయిల్..
-
Banks-Government: బ్యాంక్‌ల డిమాండ్లకు ససేమిరా.. కేంద్రం ఏం చెబుతుందంటే..!
-
Afg Vs Nepal: ఏంది సామీ ఆ ఆట.. ఆఫ్ఘనిస్థాన్‌ను చుట్టేసిన నేపాల్ జట్టు.. కుమ్మేసిన పసికూన..
-
Iran: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు.. కవల సోదరీమణుల్లో ఒకరికి మరణశిక్ష మరొకరికి 27 ఏళ్ల జైలు!
-
The Paradise-Nani: ట్రోల్స్‌ను బాగా ఎంజాయ్ చేశా.. మీ ప్రేమకు కృతజ్ఞతలు.. నాని పోస్ట్ వైరల్!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!