Site icon NTV Telugu

Parliament Elections 2024: ఎన్నికల విధులు నిర్వహిస్తుండగా.. గుండెపోటుతో ఉద్యోగి మృతి!

Btesh Student Manoj Dead

Btesh Student Manoj Dead

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పార్లమెంట్‌ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన అశ్వరావుపేట నెహ్రూ నగర్‌లో చోటు చేసుకుంది.

అశ్వరావుపేట నెహ్రూ నగర్‌ 165 పోలింగ్ బూత్‌లో విధులు నిర్వహిస్తున్న శ్రీ కృష్ణ అనే ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో అక్కడ కాసేపు పోలింగ్ ఆగిపోయింది. అధికారులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు శ్రీ కృష్ణ కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. విషయం తెలిసిన మృతుడి కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.

Exit mobile version