Site icon NTV Telugu

Omicron BF7: కరోనా బూస్టర్ డోస్ గా ముక్కులో చుక్కల మందు

Corona

Corona

Omicron BF7: ప్రపంచమంతా ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్‎కు భయపడిపోతుంది. పరిస్థితి మళ్లీ మొదటికి వస్తోందన్న వార్తలతో జనాలు జంకుతున్నారు. మూడు వేవ్‎లను దాటుకున్న కరోనా నాలుగో వేవ్ కు సిద్ధం కావడంతో ప్రభుత్వం మహమ్మారి నియంత్రణ చర్యలకు దిగింది. మళ్లీ ప్రజలను వ్యాక్సిన్లు వేయించుకోవాలని సూచించింది. రెండేళ్లలో కరోనా రెండు వ్యాక్సిన్లు వేయించుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసినా ఇంకా చాలామంది వేయించుకోలేదు. ఒక డోస్ వేయించుకున్న వారు రెండోది. రెండోది వేయించుకున్న వారు బూస్టర్ డోసు వేయించుకోలేదు. చైనా పరిస్థితి మన దేశానికి రాకూడదని ముందస్తు చర్యలను ప్రారంభించింది.

Read Also: Lord Krishna Tallest Statue: ప్రపంచంలోనే ఎత్తైన శ్రీ‌కృష్ణుడి విగ్రహం.. ఎక్కడంటే..

హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఇంట్రా నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ కు అనుమతి మంజూరు చేసినట్టు, దీన్ని కోవిన్ యాప్ లో చేర్చనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ ప్రకటించారు. దీన్ని బూస్టర్ డోస్ గా తీసుకోవచ్చని, ముందుగా ప్రైవేటు హాస్పిటల్స్ లో అందుబాటులోకి వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. నేటి నుంచి కోవిడ్ టీకాల కార్యక్రమంలో దీన్ని కూడా చేర్చినట్టు పేర్కొన్నాయి.

Read Also: Terrorists arrested: కశ్మీర్‌లో ఐదుగురు హిజ్బుల్‌ ఉగ్రవాదులు అరెస్ట్‌

కోవిన్ యాప్ లో నాసల్ టీకాను శుక్రవారం చేర్చనున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. దీంతో అధికారికంగా దీన్ని ఎవరైనా తీసుకునేందుకు వీలుంటుంది. టీకా సర్టిఫికేషన్ కూడా యాప్ నుంచి తీసుకోవచ్చు. కరోనా మొదటి రెండు డోసులు తీసుకున్న వారు బూస్టర్ డోస్ కు అర్హులు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ తీసుకున్న వారు అవే కంపెనీ బూస్టర్ టీకాలు తీసుకోవచ్చు. వాటికి బదులు నాసల్ టీకాను కూడా తీసుకోవచ్చు. 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ నాసల్ టీకా పొందేందుకు అర్హులు. దీని ధరను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనాకు కోవాగ్జిన్, కోవిషీల్డ్, కోవోవ్యాక్స్, స్పుత్నిక్ వీ, బయోలాజికల్ ఈ కార్బోవ్యాక్స్ అందుబాటులో ఉన్నాయి.

Exit mobile version