NTV Telugu Site icon

Tamilisai : నేడు వరంగల్‌లో గవర్నర్‌ తమిళిసై పర్యటన.

Tamilisai Soundararajan

Tamilisai Soundararajan

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలోని వరద ప్రభావిత కాలనీలు, భద్రకాళి ట్యాంక్‌బండ్‌ను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బుధవారం సందర్శించనున్నారు. కుండపోత వర్షాల కారణంగా ముంపునకు గురైన కాలనీలను గవర్నర్ సందర్శించి, ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలతో సంప్రదిస్తారని రాజ్ భవన్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది. హన్మకొండ, వరంగల్ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖలు చేపట్టిన సహాయక చర్యలను కూడా ఆమె సమీక్షించనున్నారు.

 

Also Read : TS TET : తెలంగాణలో సెప్టెంబర్‌ 15న టెట్‌.. నేటి నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు.

మంగళవారం రాజ్ భవన్ లో గవర్నర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాలు, వరదలకు పబ్లిక్ కు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని మీడియా సమావేశంలో గవర్నర్ అన్నారు. ప్రాణ నష్టంతో పాటు ఇండ్లు, ఆస్తులు డ్యామేజ్ అయ్యాయన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రజలను ఆదుకోవాలని సూచించారు. ములుగు, భద్రాచలం, ఆదిలాబాద్ ట్రైబల్ ఏరియాల్లో ఎక్కువ నష్టం జరిగిందన్నారు. జల్ పల్లి మున్సిపాలిటీలో ఇప్పటికీ నీళ్లు నిలిచే ఉన్నాయని, నీళ్లను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వరద నష్టంపై అన్ని పార్టీలు వినతిపత్రాలు ఇచ్చాయన్నారు. ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి పబ్లిక్ ను ఆదుకోవాలని కోరారు.

Also Read : Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌