Site icon NTV Telugu

Telangana Assembly: ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నాం.. త్వరలో మరో రెండు

Governor

Governor

Governor: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాళోజీ కవితతో ప్రసంగాన్ని గవర్నర్‌ తమిళిసై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించారు.. ప్రగతిభవన్‌ను.. ప్రజాభవన్‌గా అందుబాటులోకి వచ్చింది.. ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నాం.. ఆరు గ్యారంటీలను అందుబాటులోకి తీసుకుచ్చాం.. త్వరలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని ఆమె చెప్పుకొచ్చారు. అర్హులకు 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం.. రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీల అములుకు కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మాకు అప్పగించారు.. రాష్ట్రాన్ని పునర్‌నిర్మించే ప్రయత్నం చేస్తున్నామని గవర్నర్ తమిళిసై వెల్లడించారు.

Read Also: Kapu Ramachandra Reddy: నా భవిష్యత్తేంటో పైవాడే నిర్ణయిస్తాడు..

దశాబ్ధకాంలో నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేస్తామని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు.. TSPSC, SHRC లాంటి సంస్థలు బాధ్యతాయుతంగా పని చేసే స్వేచ్ఛను కల్పిస్తామన్నారు. గత సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశాం.. ప్రజావాణి ద్వారా ప్రభుత్వం ప్రజా సమస్యలను తెలుసుకుంటోంది అని ఆమె వెల్లడించారు. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతాం.. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారు.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం తీసుకోస్తాం.. మౌళిక వసతుల రంగాన్ని అభివృద్ధి చేయబోతున్నాం.. ఇంటర్నెట్‌ కనీస అవసరంగా గుర్తించి అందించే ప్రయత్నం చేస్తున్నాం.. టీఎస్‌పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.

Exit mobile version