Site icon NTV Telugu

Governor Tamilisai : ఎంపీ అర్వింద్‌ ఇంటిపై దాడిని ఖండించిన గవర్నర్‌ తమిళిసై

Tamilisai

Tamilisai

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ నివాసంపై నేడు దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె.. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనపై సవివరమైన నివేదిక అందజేయాలని పోలీసు డైరెక్టర్ జనరల్‌ను కోరారు. హైదరాబాద్‌లోని ఎంపీ నివాసంపై దాడి చేసి ధ్వంసం చేయడంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ఎంపీ నివాసంలో కుటుంబ సభ్యులను, ఇంటి పనిమనిషిని బెదిరించడం, భయపెట్టడం ఖండనీయమని, ప్రాధాన్యతా ప్రాతిపదికన డీజీపీ నుంచి నివేదిక కోరామని ఆమె అన్నారు.

Also Read : Trade Advisory Committee: పదే పదే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు.. ఆర్థికశాఖ మంత్రి ఎదుట వ్యాపారుల ఆవేదన
అయితే.. ఇటీవల కవితను బీజేపీకి రమ్మన్నారంటూ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో ఎంపీ అర్వింద్‌ స్పందించారు. అయితే.. అర్వింద్‌ వ్యాఖ్యలు వివాదస్పందంగా ఉన్నాయంటూ టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఎంపీ అర్వింద్‌ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటన తరువాతే ఎమ్మెల్సీ మీడియా ముందు ఎంపీ అర్వింద్‌పై నిప్పులు చెరిగారు. తీవ్ర స్థాయిలో ఎంపీ అర్వింద్‌పై విమర్శలు గుప్పించారు. అయితే.. మరో వైపు ఈ దాడిని బీజేపీ శ్రేణులు ఖండిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలపునిచ్చారు.

Exit mobile version