తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విలీన డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. ఇక, తెలంగాణ అసెంబ్లీలోని శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ తమిళిసై కన్సెంట్ ఇచ్చింది. తమిళిసై ఆమోదంతో ఆర్టీసీ బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయి. బిల్లును ఈరోజే సభలో ప్రవేశపెడతారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక.. ట్రాన్స్‌పోర్ట్ అధికారులతో గవర్నర్ సమావేశం ముగిసింది.
Read Also: Tomato: రెండు నెలల్లో టమాటా అమ్మి కోటీశ్వరుడయ్యాడు.. కారు, ట్రాక్టర్ కొన్నాడు
అయితే, ఈరోజు మధ్యాహ్నం ఆర్టీసీ అధికారులతో గవర్నర్ తమిళిసైసౌందరరాజన్ సమావేశం అయ్యారు. ఈ భేటీలో తనకున్న ప్రశ్నలపై అధికారులను ఆమె అడిగారు. ఇక, రవాణాశాఖకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు సహా ఆర్టీసీకి చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆర్టీసీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల విషయమై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన సందేహలను అడిగారు. గవర్నర్ లేవనెత్తిన అంశాలపై అధికారులు సమాధానం చెప్పారు.ఈ సమాధానాలపై గవర్నర్ తమిళిసై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తరువాత కొద్దిసేపటికే ఆర్టీసీ ముసాయిదా బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపుతున్నట్టు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి.
https://www.youtube.com/live/fZa1sgk9-TA?feature=share
Read Also: Akbaruddin owaisi: మా ప్రయాణం బీఆర్ఎస్ పార్టీతోనే..