Site icon NTV Telugu

Telangana: “భూభార‌తి”కి గ‌వ‌ర్నర్ ఆమోదం.. వీలైనంత త్వర‌గా అమ‌లులోకి

Bubharathi

Bubharathi

భూ స‌మ‌స్యలకు శాశ్వత ప‌రిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం భూ భార‌తి చ‌ట్టాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.. 2024 డిసెంబరు 18న అసెంబ్లీలో ఈ బిల్లును రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టారు. అదే నెల 20న శాసనసభలో, 21న శాసనమండలిలో బిల్లుపై చర్చ జరిగిన అనంతరం సభలు ఆమోదించాయి. అనంతరం.. భూభారతి బిల్లు గవర్నర్‌ కార్యాలయానికి చేరింది.

Read Also: Congress: కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేతలు..

తాజాగా.. “భూభార‌తి” చట్టానికి గ‌వ‌ర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో.. వీలైనంత త్వర‌గా చ‌ట్టాన్ని అమ‌లులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజ‌ల‌కు మెరుగైన రెవెన్యూ సేవ‌లు అందిస్తామని చెప్పారు. ఈ చట్టంలో పాలు పంచుకున్న అందరికీ ఆయన కృత‌జ్ఞత‌లు తెలిపారు. ఈ చ‌ట్టానికి సంబంధించిన విధి విధానాల‌ను రూపొందించాలని.. అందుకు ప్రత్యేక దృష్టి సారించాల‌ని మంత్రి పొంగులేటి అధికారుల‌కు సూచించారు. కాగా.. గ‌వ‌ర్నర్ ఆమోదించిన భూభార‌తి బిల్లు కాపీని గురువారం స‌చివాల‌యంలో మంత్రి శ్రీనివాస రెడ్డికి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి న‌వీన్ మిట్టల్ అంద‌జేశారు.

Read Also: Liquor Payments: తెలంగాణా సర్కార్‌కు మద్యం కంపెనీల అల్టిమేటం.. బకాయిలు చెల్లించాల్సిందే!

Exit mobile version