NTV Telugu Site icon

Phone Tapping Case: గవర్నర్ ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాపింగ్.. బీజేపీ సీరియస్

Indrasena Reddy Munugodu

Indrasena Reddy Munugodu

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.. నవంబర్ 2023 సంవత్సరంలో 15 రోజుల పాటు త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాప్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు.. దర్యాప్తులో భాగంగా ఇంద్రసేన రెడ్డి పీఏను అధికారులు విచారించారు. విచారణ సమయంలో ఫోన్ ట్యాప్ వ్యవహారం బయటపడింది.. ప్రస్తుతం ఇంద్రసేనరెడ్డి త్రిపుర గవర్నర్‌గా ఉన్నారు. ఇంద్రసేనరెడ్డి సంబంధించిన అన్ని వ్యవహారాలను పీఏ చూసుకుంటున్నారు.. పీఏను ఇందులో సాక్షిగా పెట్టే అవకాశం! ఉంది. గతంలో ఈ వ్యవహారంపై ఇంద్రసేన రెడ్డి ఫిర్యాదు చేశారు.. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.. గవర్నర్‌గా ఉన్న సమయంలో ఇంద్రసేనరెడ్డి ఫోన్ ట్యాప్ చేయడం వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? అనే అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 300 మంది నాయకులు, బిజినెస్‌ మ్యాన్‌లు, రియల్‌ఎస్టేట్ వ్యాపారుల ఫోన్‌లు ట్యాప్ చేసినట్లు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు..

READ MORE: MP Gurumurthy: విజయసాయిరెడ్డిని కలిసిన ఎంపీ గురుమూర్తి.. ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇదిలా ఉండగా.. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంపై బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి బీజేపీ కోర్టును ఆశ్రయించింది.