NTV Telugu Site icon

Governor Abdul Nazeer: విద్యను సమాజ హితం కోసం వినియోగించాలి..

Governor Abdul Nazeer

Governor Abdul Nazeer

Governor Abdul Nazeer: ప్రతి విద్యార్థి తాము సమర్జించిన విద్యను సమాజ హితం కోసం వినియోగించాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్ నజీర్.. తిరుపతి పర్యటనలో ఉన్న ఆయన.. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు.. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రపంచంలోనే యువ శక్తి ఉన్న దేశం భారత్.. సహజ వనరుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. వ్యవసాయం ప్రధానంగా పాడి పరిశ్రమతో మొదలైంది.. కాలుష్య నివారణతో కూడిన సమాజ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్.

Read Also: Kishan Reddy: బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులతో కిషన్ రెడ్డి సమావేశం

ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేరళ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ ఎమ్మార్ శిశిథర్ మాట్లాడుతూ.. విద్య, వైద్యం, పరిశోధన విభాగంలో ముందు భాగంలో నిలిచిందని యూనివర్సిటీపై ప్రశంసలు కురిపించారు.. ఎస్వీయూ 42 కేంద్రాలలో మంచి సేవలు అందిస్తోందన్నారు. రైతులకు పూర్తి స్థాయి సేవలు అందించి దేశ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలన్న ఆయన.. 183 రకాల ఆవులు దేశంలో వున్నాయి.. డెయిరీ రంగంలో దేశం ప్రపంచంలోనే అగ్రభాగాన నిలిచిందన్నారు. పౌల్ట్రీ రంగంలో కూడా ఆంధ్ర పురోగతి సాధించింది.. 62 శాతం ప్రజలు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడ్డారని వెల్లడించారు కేరళ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ ఎమ్మార్ శిశిథర్.

Show comments