NTV Telugu Site icon

CM Chandrababu: ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం..

Ap Cm Chandrababu

Ap Cm Chandrababu

హౌసింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీని నెరవేరుస్తూ గృహ నిర్మాణ శాఖ రివ్యూలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కొత్త లబ్దిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Sathya Show Room: ఆఫర్లే.. ఆఫర్లు.. మీ సత్యా ఇప్పుడు శ్రీకాళహస్తిలో..

ఈ సందర్భంగా మంత్రి పార్థసారధి మాట్లాడుతూ.. గ్రామాల పరిధిలో పేదలకు మూడు సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పట్టణాల్లో పేదలకు 2 సెంట్ల స్థలాన్ని ఇస్తాం.. కొత్త లబ్దిదారులకు ఈ విధానం అమలు చేయనున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లే అవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇళ్ల నిర్మాణమనేది ప్రభుత్వానికి హై ప్రయార్టీగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారని మంత్రి పార్థసారధి చెప్పారు. రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. వచ్చే ఏడాది కాలంలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నామని మంత్రి పేర్కొన్నారు.

Buddy: అల్లు శిరీష్”బడ్డీ” సినిమాకి స్పెషల్ ఆఫర్

గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్దిదారులను పక్కన పెట్టేసిందని.. ఇళ్లు పూర్తి అయినా పేమెంట్లు చెల్లించ లేదని మంత్రి పార్థసారధి తెలిపారు. ఇలాంటి బాధిత లబ్దిదారులకు చెల్లింపులు జరపాలని చంద్రబాబు ఆదేశించారన్నారు. మధ్య తరగతి ప్రజలకు ఎంఐజీ లే అవుట్లని ఏర్పాటు చేస్తామన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేపట్టి.. తక్కువ ధరలకు ఇళ్లను నిర్మించి ఇస్తామని తెలిపారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగించాలనే అంశంపై చర్చ జరిగిందని.. ఇప్పటికే ప్రారంభించిన ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి.. మౌలిక సదుపాయాలను కల్పించ లేదని.. మౌళిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఒక్క హౌసింగ్ శాఖలోనే రూ. 10 వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది..
ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టిందని ఆరోపించారు. 2014-2019 మధ్య కాలంలో నాలుగున్నర లక్షల మందికి రాష్ట్ర నిధులతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని మంత్రి చెప్పారు.