Site icon NTV Telugu

Venkatrami Reddy: గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Venkatrami Reddy

Venkatrami Reddy

గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. 1.34 వేల మంది సచివాలయాల్లో పని చేస్తున్నారన్నారు. ఏక పక్ష ధోరణితో ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో సేవలు చెయ్యడానికి సచివాలయ వ్యవస్థ ఏర్పడిందని చెప్పారు. సచివాలయ వ్యవస్థ వల్ల కరోనా కంట్రోల్ అయిందని సాక్షాత్తు ప్రధాని చెప్పినట్లు గుర్తు చేశారు.. జాబ్ చార్ట్ లేకుండా సచివాలయ ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు..

READ MORE: Central Cabinet Decisions: నేషనల్ క్రిటికల్ మిషన్‌కు కేబినెట్ ఆమోదం.. ఎన్ని కోట్లు కేటాయించారంటే..!

కనీసం లీవ్ కూడా పెట్టడానికి నలుగురు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రభుత్వం సమస్య పరిష్కారం చేయలేదని.. కూటమి ప్రభుత్వం వచ్చాక వారి సమస్యలు ఎక్కువయ్యాయని తెలిపారు. ఇప్పటికే వలంటీర్ వ్యవస్థ లేదని.. బాధ్యత మొత్తం సచివాలయ ఉద్యోగులపై పడిందన్నారు. ప్రభుత్వం రేషనలైజేషన్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు.

READ MORE:Minister Satya Prasad: భూ సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి..

Exit mobile version