Site icon NTV Telugu

Breaking: అంగన్వాడీలతో చర్చలు విఫలం.. జీతాలు పెంపు సాధ్యం కాదన్న సర్కారు

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Andhrapradesh: అంగన్వాడీ నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుతం వేతనాలు పెంచే పరిస్థితిలో ప్రభుత్వం లేదని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. జీతాలు పెంచకుంటే సమ్మె విరమించేదే లేదని అంగన్వాడీ సంఘాలు స్పష్టం చేశాయి. జీతాల పెంపు సాధ్యం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అంగన్వాడీలు సమ్మెను విరమించాలని కోరామని.. అంగన్వాడీలు సమ్మె విరమించుకుంటే మేం ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

Read Also: Minister Merugu Nagarjuna: సంక్షేమ పథకాలపై చంద్రబాబుతో చర్చకు సిద్ధం..

“ఇప్పటికే గర్భీణులకు పోషకాహారం అందడం లేదు. అంగన్వాడీల సమ్మె వల్ల పిల్లలకు బాలామృతం అందడం లేదు. పోషకాహారం అందకుంటే గర్భిణులు, పిల్లలు ఏమవుతారు..? సమ్మె విరమించకుంటే మేం ప్రత్యామ్నాయాలకు వెళ్లక తప్పదు. అంగన్వాడీ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగానే ఉంది. వేతనాలు పెంచాలనే ఒక్క డిమాండ్ మినహా అన్ని డిమాండ్లను మేం ఆమోదించాం. వేతనాల పెంపునకు ఇది సరైన సమయం కాదని వివరించాం. గ్రాట్యుటీ మా పరిధిలోకి రాదని అంగన్వాడీలకు వివరించాం. సంక్రాంతి తర్వాత మళ్లీ చర్చిద్దామని చెప్పాం. పలు డిమాండ్లను ఇప్పటికే నెరవేర్చాం. గర్భిణులు, బాలింతల ఇబ్బందుల దృష్ట్యా సమ్మె విరమించాలి.” అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Exit mobile version