Site icon NTV Telugu

Cease Fire Violation : అమృత్‌సర్‌లో కొనసాగుతున్న హైఅలర్ట్‌.. ప్రజలకు ప్రభుత్వ కీలక సూచనలు!

Paki

Paki

పంజాబ్‌ అమృత్‌సర్‌లో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. ప్రభుత్వం మరోసారి ప్రజలకు కీలక సూచనలు చేసింది. చాలా జాగ్రత్తగా ఉండాలని.. దయచేసి ఇళ్లలో లైట్లు ఆపి, కిటికీలకు దూరంగా ఇంటి లోపల ఉండాలని సూచించింది. దయచేసి రోడ్డు, బాల్కనీ లేదా టెర్రస్‌పైకి వెళ్లవద్దని తెలిపింది. భయపడవద్దని.. సాధారణ కార్యకలాపాలను ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తామో తెలియజేస్తామని ప్రకటించింది. ఈ సమాచారాన్ని అమృత్‌సర్ డీసీ ఉదయం 4.39 గంటలకు జారీ చేసిన మార్గదర్శకంలో తెలిపింది.

READ MORE: Bangladesh: షాకింగ్.. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌ను నిషేధించిన యూనస్ ప్రభుత్వం!

భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్‌ డ్రోన్‌ దాడులకు తెగబడుతోంది. శనివారం తెల్లవారుజామున అమృత్‌సర్‌లోని ఖాసా కంటోన్మెంట్‌ గగనతలంలో భద్రతా బలగాలు శత్రు డ్రోన్‌ను గుర్తించాయని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. వైమానిక రక్షణ విభాగాలు వెంటనే దాన్ని కూల్చివేశాయని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను, చిత్రాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కాగా.. కాల్పుల విరమణ అనంతరం కూడా అమృత్‌సర్‌లో రాత్రి డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. గత రెండ్రోజులుగా అమృత్‌సర్‌ పరిసరాల్లో వరుసగా మిస్సైల్‌ శకలాలు లభ్యం అవుతుండటంతో ప్రజలు భయాందోళలనకు గురవుతున్నారు.

READ MORE: Cease Fire Violation : భారత్‌లోకి చొరబడేందుకు పాక్ యత్నం.. తిప్పికొట్టిన సైన్యం!

కాగా.. భారత్, పాక్‌ ఉద్రిక్తతలు చల్లారినట్లే చల్లారి మళ్లీ వేడందుకున్నాయి. అమెరికా, మరికొన్ని దేశాల దౌత్యంతో.. రెండుదేశాల అంగీకారంతో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ‘సైనిక కార్యకలాపాల డైరెక్టర్‌ జనరల్‌’ (డీజీఎంవో) స్థాయిలో రెండు దేశాల అధికారుల మధ్య చర్చలు ఫలించాయి. అయితే కాసేపటికే పాకిస్థాన్‌ మళ్లీ దాడులకు తెగబడింది. సరిహద్దులోని పలు ప్రాంతాలపైకి డ్రోన్లు ప్రయోగించింది. మన సైన్యం వాటిని సమర్థంగా నిలువరించింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ.. సాయంత్రం 6 గంటల సమయంలో కాల్పుల విరమణపై ప్రకటన చేశారు. రెండు దేశాలు శాంతికి అంగీకరించాయని అంతకుముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు.

Exit mobile version