Site icon NTV Telugu

TG GOVT: నేతన్నలకు తీపికబురు.. ఒక్కో కార్మికుడికి రూ.లక్ష రుణమాఫీ చేస్తూ ప్రభుత్వం జీఓ

Revanth Reddy

Revanth Reddy

చేనేత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న నేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద పరిశ్రమ అయిన చేనేతను సర్కారు ఆదరించింది. ‘చేనేత వృత్తిపై ఆధారపడిన నేతన్నలకు కాంగ్రెస్‌ సర్కారు అండగా ఉంటుంది. నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటాం. రైతు రుణమాఫీ తరహాలోనే నేతన్నలకు కూడా మాఫీ చేస్తాం. రుణమాఫీకి ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నాం’ గతేడాది సెప్టెంబర్‌ 9న హైదరాబాద్‌లో ఐఐహెచ్‌టీ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీ ఇది. తాజాగా ఈ హామీని సీఎం రేవంత్‌రెడ్డి నెరవేర్చారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. చేనేత కార్మికుల రుణాలు మాఫ చేస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. రూ. 33 కోట్ల రుణాలు మాఫీ చేయనున్నారు. ఒక్కో చేనేత కార్మికుడికి లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ కానున్నాయి.

READ MORE: Hyundai Super Delight March Offer: కార్లపై ఆఫర్ల వర్షం.. ఆ మోడల్ పై రూ. 55 వేల డిస్కౌంట్

ఇదిలా ఉండగా.. ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. త్యాగానికి మారుపేరు కొండా లక్ష్మణ్ బాపూజీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. “తెలంగాణ కోసం పదవిని త్యాగం చేసి… తెలంగాణ వచ్చాకే పదవులు తీసుకుంటా అని చెప్పిన నేత కొండా లక్ష్మణ్ బాపూజీ. బీఆర్ఎస్ కి పురుడు పోసింది కొండా బాపూజీ. పార్టీ పెట్టినప్పుడు నీడ కల్పించింది ఆయనే.. కానీ ఆయనకు నిలువ నీడా లేకుండా చేశారు. ఆయన చనిపోతే కనీసం సంతాపం చెప్పడానికి కూడా రాలేదు. పద్మశాలి బిడ్డలు గుర్తుంచుకోండి. టైగర్ నరేంద్రని ధృతరాష్ట్ర కౌగిలి చేసుకుని ఖతం చేశారు. బతుకమ్మ చీరల బకాయిలు పెట్టీ వాళ్ళను ఇబ్బంది పెట్టింది బీఆర్‌ఎస్. రాపోలు ఆనంద భాస్కర్.. 35 ఏండ్లు సేవలు చేసినందుకు.. రాజ్యసభకు పంపింది సోనియా గాంధీ. అవకాశం వస్తే పద్మశాలి సోదరులను కాపాడాలని ఆలోచన నాది. చేనేతకు అండగా ఉండాలన్నది నా ఆలోచన. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు.. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీ కి పెడతాం. రైతన్నలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చామో… నేతన్నలకీ అంతే ప్రాధాన్యత మీ సోదరుడు రేవంత్… సీఎంగా ఉన్నాడు. అడిగి పని చేయించుకోండి..” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Exit mobile version