Site icon NTV Telugu

Gorre Puranam: కాస్త గ్యాప్ ఇవ్వు సుహాస్.. ‘గొర్రెపురాణం’ అంటూ మరోకొత్త కాన్సెప్ట్‌తో..

Gorre Puranam

Gorre Puranam

విలక్షణమైన పాత్రలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్. గత వారం ప్రసన్నవదనం పేరుతో విడుదలై సినిమా ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమా థియేటర్లలో ఉండగానే.. సుహాస్ మరో సినిమాను ప్రకటించాడు. ఇది “గొర్రె పురాణం” అనే విభిన్న కథాంశంతో రాబోతుంది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించాడు. ఇకపోతే మేకర్స్ తాజాగా ఈ చిత్ర ఫస్ట్ టీజర్‌ ను విడుదల చేశారు.

Also Read: Hanu-man: టీవీల్లోనూ అదరగొట్టేసిన హనుమాన్..

ఈ టీజర్ చూస్తుంటే.. ఈ గొర్రె తమదేనని హిందూ, ముస్లిం మతాల పెద్దలు వాదిస్తున్నారు. అయితే ఈ వివాదం చిన్నగా మొదలై.. గ్రామ సమస్యగా మారింది. మరోవైపు, సుహాస్‌ ను సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చేలా చూపించారు. కానీ ఊరి ప్రజలు అసలు గొర్రెలను ఎందుకు చంపాలని భావిస్తున్నారు? ఇక కథలో సుహాస్ కి గొర్రెకి ఉన్న సంబంధమేమిటో కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. వినోదభరితంగా సాగే ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.

Exit mobile version