Site icon NTV Telugu

Gorantla Madhav: నల్లపాడు పోలీస్ స్టేషన్ కు గోరంట్ల మాధవ్.. విచారించనున్న పోలీసులు..

Gorantla Madhav

Gorantla Madhav

వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసుల విచారణ మొదలయ్యింది. పోలీసుల అదుపులో ఉన్న ఐ టీడీపీ నేత చేబ్రోలు కిరణ్ పై దాడికి ప్రయత్నించిన ఘటనలో గోరంట్ల మాధవ్ పై కేసు నమోదయ్యింది. ఈ కేసు విచారణలో భాగంగా ఐదు రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ నగరంపాలెం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజులు పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న గోరంట్ల మాధవ్ ను అక్కడనుంచి గుంటూరుకు తీసుకొచ్చారు.

Also Read:AP: 598 మార్కులు సాధించిన విద్యార్థిని.. అభినందించిన జిల్లా విద్యాశాఖ అధికారులు

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం విచారణ కోసం నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. కిరణ్ పై దాడికి ప్రయత్నించిన ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారించనున్నారు. కిరణ్ పోలీసు వాహనంలో వస్తున్న విషయం ఎవరైనా మాధవ్ కు సమాచారం ఇచ్చారా… కిరణ్ పైదాడి ప్రయత్నం వెనుక ఎవరి ప్రమేయం అయినా ఉందా అన్న కోణంలో పోలీసులు గోరంట్ల మాధవ్ ను విచారించనున్నారు. ఈ రోజు, రేపు‌ గోరంట్ల మాధవ్ ను పోలీసులు విచారించనున్నారు.

Exit mobile version