Gorantla Butchaiah Chowdary: గోదావరి జిల్లాలు రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాలు రాబోయే ఎన్నికల్లో వార్ వన్‌సైడే అన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు గోరంట్ల.. తెలుగుదేశం పార్టీ నుంచి వరుసగా పదోసారి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారాయన.. భారీ ర్యాలీగా కలెక్టర్ కు తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు.. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి జిల్లాలు రాజకీయ చైతన్యం కలిగినవి.. రాక్షస పాలనకు చరమగీతం పాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం అని ధీమా వ్యక్తం చేశారు.. రాబోయే ఎన్నికల్లో వన్ సైడ్ వార్ గా కూటమి ఘన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక మేనిఫెస్టోతో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబెడుతాను అని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, మరోసారి రాజమండ్రి రూల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
Read Also: Iran Israel tensions: ఎయిరిండియా కీలక ప్రకటన.. సర్వీస్‌లు నిలిపివేత
కాగా, సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ పై క్లారిటీ వచ్చినప్పటి నుంచే ప్రచారంలోకి దిగారు బుచ్చయ్య చౌదరి.. తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. ఈ సారి బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రావాల్సిన అవశ్యకథను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. అందరూ సమిష్టిగా కృషిచేసి కూటమిని గెలిపించి మళ్లీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని.. జగన్ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో అంతా అవినీతి మయమేనని ఆరోపిస్తున్నారు.. చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో ద్వారా ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా ఏడాదికి రూ 15 వేల చొప్పున, వారి చదువు కోసం అందిస్తారని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న వారికి నెలకు రూ.1500 అంతేకాకుండా నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3 వేలు అందిస్తే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది అనే ఆలోచనతో చంద్రబాబు మహాశక్తి పథకాలు ప్రకటించారు అని అన్నారు.నవరత్నాల పేరుతో జగన్ అందర్నీ దగా చేసాడని, మైనార్టీలకు, దళిత, గిరిజనులకు ఎటువంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేసారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లు నిర్మాణం చేసి అందరి సొంతింటి కలను నిజం చేయడానికి కృషిచేస్తామని తెలిపారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.