Gopichand’s Bhimaa Movie Trailer Release Date: ‘మ్యాచో స్టార్’ గోపీచంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘భీమా’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహించగా.. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కెకె రాధామోహన్ నిర్మిస్తునారు. భీమా సినిమాలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగా.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మహా శివరాత్రి కానుకగా మార్చి 8న భీమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
భీమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో.. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదల చేసిన చిత్ర యూనిట్.. ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారు చేసింది. భీమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 24 సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబందించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.
Also Read: Tantra Movie: పిల్లబచ్చాలు రావోద్దు.. ఆకట్టుకుంటున్న అనన్య నాగళ్ల ‘తంత్ర’ పోస్టర్!
గోలీమార్ తర్వాత మరోసారి భీమా సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా గోపీచంద్ నటిస్తున్నాడు. గత కొంతకాలంగా గోపీచంద్ సినిమాలు వరుసగా ప్లాప్స్ అవుతున్నాయి. మారుతి దర్శకత్వంలోని ‘పక్కా కమర్షియల్’, డైరెక్టర్ శ్రీవాస్ తెరకెక్కించిన ‘రామబాణం’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చాయి. ఈ నేపథ్యంలో ‘భీమా’ సినిమాపై గోపీచంద్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాకు హెల్ప్ కానుంది.
#BHIMAA Trailer on FEB 24th 2024 @ 4PM
#BHIMAAonMARCH8th pic.twitter.com/4f0dvJvuny— Vamsi Kaka (@vamsikaka) February 23, 2024