Bomb Threat: మహారాష్ట్రలోని పుణెలో ఉన్న గూగుల్ కార్యాలయంలో బాంబు ఉందని బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. చివరకు అది బూటకమని అని తేలింది. అయితే ఈ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని హైదరాబాద్‌లో మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుణె నగరంలోని గూగుల్ కంపెనీ కార్యాలయానికి ఆవరణలో బాంబు ఉందని కాల్ రావడంతో కాసేపట్లోనే అప్రమత్తమయ్యామని, అది బూటకమని పోలీసులు సోమవారం తెలిపారు. మద్యం మత్తులో ఫోన్ చేసిన వ్యక్తిని హైదరాబాద్‌కు తరలించి అక్కడి నుంచి అరెస్టు చేసినట్లు తెలిపారు.
పుణెలోని ముంధ్వా ప్రాంతంలోని బహుళ అంతస్తుల వాణిజ్య భవనంలోని 11వ అంతస్తులో ఉన్న కార్యాలయానికి ఆదివారం అర్థరాత్రి ఆఫీస్ ప్రాంగణంలో బాంబు పెట్టినట్లు కాల్ వచ్చిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ V) విక్రాంత్ దేశ్‌ముఖ్ తెలిపారు. అప్రమత్తమైన పుణె పోలీసులు, బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని విస్తృతంగా సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. “కాల్ తరువాత బూటకమని తేలింది. కాల్ చేసిన వ్యక్తిని హైదరాబాద్‌లో గుర్తించి పట్టుకున్నారు. అతను మద్యం మత్తులో కాల్ చేసాడు” అని అధికారి తెలిపారు. ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు.
Kishan Reddy: కేసీఆర్ కు కిషన్ రెడ్డి సవాల్.. దేశ ఆర్థిక పరిస్థితి పై చర్చకు సిద్ధమా?
ఇదిలా ఉండగా.. గూగుల్ సంస్థ తరపున దిలీప్ తాంబే ఈ ఘటనపై ముంబయిలోని బీకేసీ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన పాణ్యం బాబు శివానంద్ అనే వ్యక్తి కాల్ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ చేరుకుని అతడిని అరెస్ట్ చేశారు. అతడు మద్యం మత్తులో కాల్ చేశాడని పోలీసులు తెలిపారు. ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని చెప్పారు.
