Google Relaunching Google Maps Street View.
ఎప్పటికప్పుడు గూగుల్ తన వినియోగదారులను సంతృప్తి పరిచేందుకు కొత్త కొత్త ఫీచర్లను తీసుకువస్తూన ఉంది. అయితే గూగుల్ అందించే ఫీచర్లలో మ్యాప్స్ ఫీచర్ ఎంతో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ ను ఎన్నో కోట్ల మంది వినియోగిస్తున్నారు. అందుకే వినియోగదారులకు అనుగుణంగా ఉండేందుకు భారత్‌లో స్ట్రీట్ వ్యూ సేవలను గూగుల్ మళ్లీ పునఃప్రారంభించింది. అయితే ఇటీవలే దేశీయ టెక్ సంస్థలైన టెక్ మహీంద్రా, జెనిసిస్‌తో కలిసి ఒప్పందం చేసుకున్న గూగుల్.. ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ సహా తొలుత 10 నగరాల్లో ఈ సేవలను తిరిగి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది గూగుల్. ఈ ఏడాది చివరి నాటికి 50 నగరాల్లో ఈ సేవలు ప్రారంభించాలని చూస్తోంది. తొలి దశలో హైదరాబాద్ సహా బెంగళూరు, చెన్నై, దిల్లీ, పుణె, నాసిక్, వడోదరా, అహ్మదాబాద్, అమృత్‌సర్‌లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గూగుల్ వెల్లడించింది. ఆయా నగరాల్లో లక్షన్నర కిలోమీటర్లు స్ట్రీట్ వ్యూలో కవర్ అయినట్లు పేర్కొంది గూగుల్.
Super Splendor Canvas Black Edition : బైక్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ మోడల్ అదిరింది
ఓ వీధిని 360 డిగ్రీల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూ ద్వారా పనోరమా షాట్స్‌లో వీక్షించొచ్చు. కంప్యూటర్‌లో గానీ, మొబైల్‌లో గానీ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి 10 నగరాల్లోని స్ట్రీట్ వ్యూలను చూడొచ్చు. గూగుల్ 15 ఏళ్ల క్రితమే స్ట్రీట్ వ్యూ సేవలను ప్రారంభించగా.. 2011లో తొలిసారి భారత్‌కు తీసుకొచ్చింది. స్ట్రీట్ వ్యూ పేరిట చిత్రాలు సేకరించడంపై అప్పట్లో ప్రభుత్వం అడ్డు చెప్పింది. ఈ టెక్నాలజీ వల్ల భద్రతాపరంగా ముప్పు పొంచి ఉందన్న కారణంతో 2016లో దీనిపై నిషేధం విధించింది. ఈ సేవల వల్ల ఉగ్రమూకలు సులువుగా రక్షణ శాఖకు చెందిన వివరాలను తెలుసుకునే అవకాశం కల్పిస్తుందన్న భావన అప్పట్లో వ్యక్తమవ్వడంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో స్థానిక టెక్ సంస్థలతో జట్టు కట్టి తాజాగా గూగుల్ వీటిని తీసుకొచ్చింది. స్ట్రీట్ వ్యూతో పాటు ప్రమాదాలను అరికట్టేందుకు మ్యాప్స్‌లో స్పీడ్ లిమిట్ ఆప్షన్ సైతం తీసుకొచ్చింది గూగుల్.