NTV Telugu Site icon

Google Pixel 9 Series: ఆగస్టు 14న భారత్‌లో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లాంచ్‌..

Google Pixel

Google Pixel

Google Pixel 9 Series: గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఆగస్టు 14న భారత్‌లో లాంచ్ కానుంది. ఈ సారి గూగుల్‌ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ మాత్రమే కాకుండా మొత్తం నాలుగు పిక్సెల్‌ ఫోన్‌లు లాంచ్‌ కానున్నట్లు తెలిసింది. సమాచారం ప్రకారం.. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్‌లో పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ లాంచ్‌ కానున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఆగస్టు 14న భారత్‌లో ప్రారంభించబడతాయి. ఈ ఫోన్‌లు ఇండియాలోఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా, ఫోన్‌ల గ్లోబల్ లాంచ్ ఆగస్టు 13న ఇండియా లాంచ్ కంటే ఒక రోజు ముందుగానే జరగనుంది.

ఈ సిరీస్‌లో నాలుగు కొత్త రంగులు ఉండనున్నట్లు సమాచారం. ముదురు బూడిద, లేత బూడిద, ఆఫ్-వైట్, పింక్ కలర్లలో పిక్సెల్ ఫోన్‌లు లాంచ్‌ కానున్నాయి. పరికరాలు మాట్-టెక్చర్డ్ బ్యాక్ ప్యానెల్‌లతో నిగనిగలాడే ఫ్రేమ్‌లను కలిగి ఉంటాయని కూడా లీక్‌లు సూచిస్తున్నాయి. కెమెరా డిజైన్‌లో మార్పులు జరిగాయి. కొత్త కెమెరా డిజైన్‌లో ప్రో మోడల్స్‌లో మూడు లెన్స్‌లు ఉంటాయి, సాధారణ పిక్సెల్‌లో రెండు లెన్స్‌లు ఉంటాయి. పిక్సెల్‌ 9 ప్రో ఫోల్డ్‌లోని కెమెరా గుండ్రని మూలలతో దీర్ఘచతురస్రం ఆకారంలో ఉంటుంది. అయితే ఫోల్డబుల్ కాని పిక్సెల్ 9 ఫోన్‌లో దీర్ఘచతురస్రాకార కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. గూగుల్‌ ఇండియా వెబ్‌సైట్‌లో గూగుల్‌ పిక్సల్‌ 9 ప్రో, పిక్సల్‌ 9 ప్రో ఫోల్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు అందుబాటులో ఉన్నాయి. తొలిసారిగా భారత్‌లో గూగుల్ తన ఫోల్డబుల్‌ హ్యాండ్‌సెట్‌ పిక్సల్‌ 9 ప్రో ఫోల్డ్‌ను విడుదల చేయనుంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో గూగుల్‌ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ పిక్సల్‌ ఫోల్డ్‌ అందుబాటులో ఉంది. అయితే త్వరలో అందుబాటులోకి రానున్న పిక్సల్‌ 9 ప్రో ఫోల్డ్‌ ఫోన్‌.. గెలాక్సీ Z ఫోల్డ్‌ 6, వన్‌ప్లస్‌ ఓపెన్‌, టెక్నో ఫాంటమ్‌ V ఫోల్డ్‌లకు పోటీనివ్వనుందని భావిస్తున్నారు.

Read Also: Women Health : మెనోపాజ్ తర్వాత మహిళల్లో బోలు ఎముకల వ్యాధి.. నివారించేందుకు చిట్కాలు ఇవే..

గూగుల్‌ పిక్సల్‌ 9 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ చాట్‌బాట్‌ జెమిని ఏఐ ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఏడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందవచ్చని తెలుస్తోంది. దీంతోపాటు పిక్సల్ డ్రాప్స్‌ ద్వారా ఎక్స్‌క్లూజివ్‌ ఫీచర్‌లను వినియోగించుకోవచ్చు. మైక్రోసాఫ్ట్‌ రీకాల్‌ ఫీచర్‌ తరహాలో పిక్సల్‌ స్క్రీన్‌షాట్‌ పేరుతో ఫీచర్‌ అందుబాటులో ఉండనుందని సమాచారం. ఎమర్జెన్సీ సమయాల్లో వినియోగదారులకు సాయం చేసేలా ఈ పిక్సల్‌ 9 సిరీస్‌ ఎస్‌ఓఎస్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. అగ్నిప్రమాదాలు, వరదలు సహా ఇతర విపత్కర పరిస్థితుల్లో అప్రమత్తత సందేశాలను పంపుతుందని తెలుస్తోంది. దీంతోపాటు మాల్‌వేర్‌ సహా ఇతర స్కామ్‌లపై అప్రమత్తం చేస్తుందని సమాచారం.

లీక్ అయిన సమాచారం ఆధారంగా పిక్సల్‌ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.3 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది అదే ఫోల్డబుల్‌ ఫోన్‌ 6.3 అంగుళాల కవర్ డిస్‌ప్లే, 8 అంగుళాల ప్రధాన డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు Tensor G4 చిప్‌సెట్‌ పైన పనిచేస్తాయి. పిక్సల్‌ 9 ప్రో 50మెగా పిక్సెల్+ 48మెగా పిక్సెల్+ 48ఎంపీ కెమెరాలు, 48ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అదే పిక్సల్‌ 9 ప్రో ఫోల్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 48MP ప్రధాన కెమెరా సహా 10.5MP + 10.5MP మరో రెండు కెమెరాలను కలిగి ఉంటుందని సమాచారం. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ 10MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Show comments