NTV Telugu Site icon

Google Doodle: నోబెల్ గ్రహీత బర్త్‌డే.. ఓజోన్ పొరను రక్షించడంలో సహాయపడిన శాస్త్రవేత్త

Google Doodle

Google Doodle

Google Doodle Celebrates 80th Birthday Of Mario Molina: ప్రముఖ మెక్సికన్ రసాయన శాస్త్రవేత్త డాక్టర్ మారియో మోలినా 80వ జన్మదిన వేడుకను గూగుల్ ఆదివారం నాడు కలర్‌ఫుల్ డూడుల్‌తో జరుపుకుంది. రసాయన శాస్త్రంలో 1995 నోబెల్ బహుమతి సహ-గ్రహీత, మారియో మోలినా ఓజోన్ పొరను రక్షించడానికి కలిసి రావాలని ప్రభుత్వాలను విజయవంతంగా ఒప్పించిన ఘనతను పొందారు. హానికరమైన అతినీలలోహిత కాంతి నుంచి మానవులు, మొక్కలు, వన్యప్రాణులను రక్షించడంలో కీలకమైన ఓజోన్‌ పొరను రసాయనాలు ఎలా క్షీణింపజేస్తాయో బహిర్గతం చేసిన పరిశోధకులలో ఒకరిగా ఉన్నారు.

మారియో మోలినా మార్చి 19, 1943న మెక్సికో నగరంలో జన్మించారు. ఆయన చిన్నతనంలో సైన్స్ పట్ల మక్కువ పెంచుకున్నాడు.తన బాత్రూమ్‌ను తాత్కాలిక ప్రయోగశాలగా మార్చాడు. తన బొమ్మ మైక్రోస్కోప్‌లో చిన్న చిన్న జీవులను చూసి ఆనందాన్ని పొందాడని గూగుల్ పేర్కొంది. ”హైస్కూల్‌లో చేరకముందే నేను సైన్స్ పట్ల ఆకర్షితుడయ్యాను. నేను చాలా ప్రాచీనమైన బొమ్మ మైక్రోస్కోప్ ద్వారా పారామెసియా, అమీబాలను మొదటిసారి చూసినప్పుడు నా ఉత్సాహం నాకు ఇప్పటికీ గుర్తుంది,” అని నోబెల్ సైట్‌లోని జీవిత చరిత్రలో డాక్టర్ మోలినా రాశారు.

Read Also: PM Modi: దేశంలో ప్రజాస్వామ్యం పటిష్ఠం.. ఓర్వలేకే దాడులు చేస్తున్నారు..

ఆయన నేషనల్ అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికో నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని, జర్మనీలోని ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయం నుంచి అడ్వాన్స్‌డ్ డిగ్రీని పొందాడు. తన చదువును పూర్తి చేసిన తర్వాత, ఆయన బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పోస్ట్‌డాక్టోరల్ పరిశోధన చేయడానికి యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లాడు. తరువాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నారు. 1970ల ప్రారంభంలో మారియో మోలినా సింథటిక్ రసాయనాలు భూమి వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో పరిశోధించడం ప్రారంభించారు. క్లోరోఫ్లోరోకార్బన్‌లు ఓజోన్‌ను విచ్ఛిన్నం చేస్తున్నాయని, అతినీలలోహిత వికిరణం భూమి ఉపరితలంపైకి చేరడానికి కారణమవుతుందని కనుగొన్న వారిలో ఆయన మొదటివాడు.

Read Also: Ashok Gehlot: సచిన్ పైలట్‌తో ఎలాంటి విభేదాల్లేవు, కలిసి పోరాడుతాం..

ఆయనతో పాటు సహ-పరిశోధకులు తమ పరిశోధనలను నేచర్ జర్నల్‌లో ప్రచురించారు. 1995లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుపొందారు. దాదాపు 100 ఓజోన్-క్షీణత ఉత్పత్తిని విజయవంతంగా నిషేధించిన అంతర్జాతీయ ఒప్పందమైన మాంట్రియల్ ప్రోటోకాల్‌కు ఈ సంచలనాత్మక పరిశోధన పునాది అయింది. 2013లో, అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా డాక్టర్ మోలినాకు యూఎస్‌లో అత్యున్నత పౌర గౌరవమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను ప్రదానం చేశారు. డాక్టర్ మోలినా అక్టోబర్ 7, 2020న 77 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. మెక్సికోలోని ప్రముఖ పరిశోధనా సంస్థ మారియో మోలినా సెంటర్, మరింత స్థిరమైన ప్రపంచాన్ని సృష్టించేందుకు తన పనిని కొనసాగిస్తోంది.