Google Doodle: గణతంత్ర దినోత్సవ సందర్బంగా ‘వైల్డ్‌లైఫ్ మీట్స్ కల్చర్’ డూడుల్‌తో అదరగొట్టిన గూగుల్
- దేశవ్యాప్తంగా ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
- వైల్డ్‌లైఫ్ మీట్స్ కల్చర్ పేరుతో ప్రత్యేక డూడిల్‌ను రూపొందించిన గూగుల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Doodle: భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రముఖ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ప్రత్యేక ‘వైల్డ్‌లైఫ్ మీట్స్ కల్చర్‘ (Wildlife Meets Culture) డూడిల్‌ను రూపొందించింది. ఈ డూడిల్ భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని, ప్రాంతాల భిన్నత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడింది. ఈ రంగురంగుల కళాఖండాన్ని పుణేకు చెందిన కళాకారుడు రోహన్ దహోత్రే చిత్రీకరించారు. ఈ డూడిల్‌లో లడాఖ్ ప్రాంతానికి చెందిన సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న మంచు చిరుత, ధోతీ-కుర్తా ధరించిన ‘పులి’తో పాటు, పావురం, నీలగిరి తహర్ వంటి పక్షులు, జంతువులు భారతదేశంలోని వివిధ ప్రాంతాలను ప్రతినిధితం చేస్తూ కనిపిస్తాయి. గూగుల్ డూడిల్ వివరణ ప్రకారం, ఈ కళాఖండం భారత గణతంత్ర దినోత్సవాన్ని, జాతీయ గర్వాన్ని, ఐక్యతను గౌరవించే గణతంత్ర దినోత్సవ ప్రత్యేక సందర్భంగా జరుపుకుంటుందని తెలిపింది.
Also Read: BALAYYA : ‘పద్మభూషణ్ నందమూరి బాలయ్య’.. గోల్డెన్ ఎరా.!
Also Read
డూడిల్‌లో మంచు చిరుత లడాఖ్ సంప్రదాయ వస్త్రాలు ధరించి, చేతిలో రిబ్బన్ పట్టుకుని కనిపిస్తుంది. పక్కనే ఉన్న పులి సాంప్రదాయ వాద్యాన్ని పట్టుకుని కనిపిస్తుంది. అలాగే, దుపట్టాలతో అలంకరించిన నీలగిరి తహర్ ఇంకా మరికొన్ని జంతువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ రోజు ఢిల్లీలోని కర్తవ్య పథ్‌పై భారత సైనిక శక్తి, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించనున్నారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు అలాగే మరికొన్ని సంస్థల నుంచి మొత్తం 31 టేబ్లూలు పరేడ్‌లో ప్రదర్శనకు సిద్ధమయ్యాయి. గణతంత్ర దినోత్సవ పరేడ్ అనేది సైనిక శక్తి, సాంస్కృతిక సంపదలతో కూడిన గొప్ప ప్రదర్శన. ఈ రోజు భారత ప్రజలందరికీ దేశభక్తిని, ఐక్యతను మరింత చాటే రోజుగా నిలుస్తుంది.
Also Read: Republic Day 2025: దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!