Google Birthday Sale: గూగుల్ పుట్టిన రోజు ధమాకా.. స్మార్ట్ఫోన్లు, వాచ్‌లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గూగుల్ తన 28వ పుట్టినరోజును పురస్కరించుకుని ‘గూగుల్ బర్త్‌డే సేల్ 2026’ను నిర్వహిస్తోంది. ఈ సేల్ సందర్భంగా గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్లు, వాచ్‌లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులు, పాత ఫోన్ల ఎక్స్ఛేంజ్ బోనస్‌లను ఉపయోగించుకుంటే కస్టమర్లు ఈ లేటెస్ట్ గాడ్జెట్లను చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
గూగుల్ బర్త్‌డే సేల్‌లో తాజా పిక్సెల్ 11 సిరీస్ ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 89,999 రూపాయల ప్రారంభ ధర కలిగిన స్టాండర్డ్ ‘పిక్సెల్ 11’ ఫోన్‌ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఆఫర్, పాత శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 ఎక్స్ఛేంజ్ ద్వారా సుమారు 57,000 రూపాయలకే దక్కించుకోవచ్చు. దీనిలో శక్తివంతమైన టెన్సర్ జీ6 చిప్సెట్ ఉంది. అలాగే దీనితో పాటు పిక్సెల్ బడ్స్ ప్రో 2 బండల్ ఆఫర్‌ను ఎంచుకుంటే అదనంగా 2,000 రూపాయల తగ్గింపు లభిస్తుంది.
Also Read
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
ఇక ‘పిక్సెల్ 11 ప్రో’ అసలు ధర 1,19,999 రూపాయలు కాగా, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ , ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కలుపుకుని దీనిని కేవలం 70,259 రూపాయల ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇంకా పెద్ద డిస్ప్లే కోరుకునేవారి కోసం అందుబాటులో ఉన్న ‘పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్’ ఫోన్ అసలు ధర 1,34,999 రూపాయలు కాగా, బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ల ద్వారా ఇది 85,250 రూపాయలకే లభిస్తుంది. ఇదే సమయంలో ‘పిక్సెల్ వాచ్ 5’ను 42,900 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు, దీని బండల్ ఆఫర్‌పై కూడా 2,000 రూపాయల అదనపు తగ్గింపు వర్తిస్తుంది.
అత్యంత ఖరీదైన ఫోల్డబుల్ ఫోన్ ‘పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్’ అసలు ధర 1,86,999 రూపాయలు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10,000 రూపాయల తక్షణ తగ్గింపు లభిస్తుంది. దీనికి తోడు పాత శామ్సంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా లభించే బోనస్‌తో కలిపి మొత్తం 57,800 రూపాయల వరకు తగ్గింపును పొందవచ్చు. దీనివల్ల ఈ ఫోల్డబుల్ ఫోన్ కేవలం 1,19,900 రూపాయలకే అందుబాటులోకి వస్తుంది. ఈ పుట్టినరోజు సేల్ గూగుల్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఒక చక్కటి అవకాశం.
తాజావార్తలు
-
Google Birthday Sale: గూగుల్ పుట్టిన రోజు ధమాకా.. స్మార్ట్ఫోన్లు, వాచ్‌లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు..
-
Venkatesh: “20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది”
-
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?