NTV Telugu Site icon

Good News From KCR: ముస్లింలకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్

Cm Kcr

Cm Kcr

Good News From KCR: రంజాన్ మాసం ఆరంభం కానుండడంతో రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. కుటుంబంతో కలిసి రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ముస్లిం సోదరులకు సూచించారు. ఈ సందర్భంగా రంజాన్ మాసం ఆరంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలో పనిచేసే ముస్లిం ఉద్యోగులకు కేసీఆర్ శుభవార్త ప్రకటించారు. ముస్లీం ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, బోర్డులు, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా అందరూ ప్రార్థనలు చేసేందుకు కార్యాలయాలు, పాఠశాలల నుంచి గంట ముందుగా బయటకు వెళ్లేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: Minister Venugopal: టీడీపీ సభ్యుల తీరు గర్హనీయంగా ఉంది

ఈ ఉత్తర్వులు మార్చి 23 నుంచి ఏప్రిల్ 23 వరకు అమల్లో ఉంటాయి. టీఎస్‌-ఎంఎస్‌ సెంట్రల్‌ అసోసియేషన్‌ హైదరాబాద్‌ చేసిన ఫిర్యాదు మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పవిత్ర రంజాన్ నెలలో కొంత సమయం ముందుగా బయలుదేరడానికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఉద్యోగులకు గంటపాటు మినహాయింపు ఇచ్చారు. తద్వారా ముస్లింలు సూర్యాస్తమయం తర్వాత తమ ఆచారాలను నిర్వహించుకోగలుగుతారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ముస్లిం ఉద్యోగులు స్వాగతించారు. ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా ఎక్కువ మంది ముస్లింలు పగటిపూట ఉపవాసం ఉంటారు. కఠిన ఉపవాస దీక్షను పాటిస్తారు. రంజాన్ నెలలో ప్రతిరోజు సూర్యోదయం ముందు నుంచి సూర్యాస్తమయం వరకు సుమారు 13 గంటలుపాటు కఠిన ఉపవాసదీక్షలు పాటిస్తారు.

Read Also: LB Nagar Flyover: తీరనున్న ఎల్బీ నగర్ వాసుల ట్రాఫిక్ కష్టాలు