NTV Telugu Site icon

Vande Bharat Train: రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఈ మార్గంలో వందే భారత్

Vande Bharat

Vande Bharat

రైలు ప్రయాణికులకు శుభవార్త అందించింది. ఇప్పటి వరకు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో వందే భారత్ రైలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా.. ఈ రైలును కొత్త రూట్లలో నడపడానికి ఇండియన్ రైల్వే సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో.. ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయోజనం పొందుతారు. కాగా.. బెంగళూరు-మధురై రూట్లో వందే భారత్ రైలు ఈరోజు నుంచి ప్రారంభమైంది.

Read Also: Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ సలహాదారుడి కిడ్నాప్..

మధురై రైల్వే స్టేషన్ నుండి ఉదయం 5.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.15 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఆ తర్వాత.. తిరుగు ప్రయాణంలో బెంగళూరు రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం 1.45 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు సేలం రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. రాత్రి 8.20 గంటలకు తిరుచ్చి చేరుకుని, మధురై రైల్వే స్టేషన్ కు రాత్రి 10.25 గంటలకు చేరుకుంటుంది.

Read Also: Health Tips: ఎక్కువ సేపు మూత్రం ఆపుకుంటే వచ్చే సమస్యలేంటో తెలుసా?

బెంగళూరు-మధురై వందే భారత్ రైలులో.. ఇతర వందే భారత్ రైళ్ల మాదిరిగానే 8 కోచ్లు ఉంటాయి. ఆ కోచ్లలో రెండు రకాల కోచ్లు ఉంటాయి. చైర్కార్, ఎగ్జిక్యూటివ్ చైర్కార్.. ఈ రెండింటికీ వేర్వేరు ఛార్జీలు ఉంటాయి. అయితే.. ప్రయాణికుల డిమాండ్ మరింత పెరిగితే, భవిష్యత్తులో వందే భారత్ రైళ్లలో అదనపు కోచ్ల సంఖ్యను పెంచవచ్చు. ఇదిలా ఉంటే.. మధురై-బెంగళూరు వందే భారత్ రైలు ఛార్జీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఏసీ చైర్కార్ ధర దాదాపు రూ.1300, ఎగ్జిక్యూటివ్ చైర్కార్ ధర రూ. 2300 ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు.. త్వరలో ఎగ్మోర్-నాగర్ కోయిల్ మార్గంలో వందే భారత్ రైలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.