NTV Telugu Site icon

Guest Lecturers: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు గుడ్ న్యూస్..

Guest Lectures

Guest Lectures

తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 1654 గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగ భద్రత, గౌరవ వేతనాల పెంపు విషయమై ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశంను ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నేత కటకం మృత్యుంజయం ఆధ్వర్యంలో గెస్ట్ లెక్చరర్ల సంఘం ప్రతినిధులు సోమవారం మంత్రిని సచివాలయంలో కలిసి తమ సమస్యలను విన్నవించారు.

Read Also: Vijay: త్రిష, రంభలతో విజయ్.. అసలు మ్యాటర్ ఇదా?

గెస్ట్ లెక్చరర్ల వేతనాన్ని ఇప్పుడున్న రూ. 28 వేల నుంచి రూ.42 వేలకు పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు ప్రిన్సిపల్ సెక్రటరీకి సూచించారు. ప్రతిపాదనల ఫైల్ పై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రెగ్యులర్ లెక్చరర్ల నియామక ప్రక్రియ జరుగుతున్నందున వారి నియామకం తర్వాత గెస్ట్ లెక్చరర్లను తొలగించకుండా.. సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించే విషయం పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Read Also: Diamond Necklace: చెత్త కుప్పలో దొరికిన డైమండ్ నెక్లెస్.. చివరకి?