Site icon NTV Telugu

TG Govt: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు సాయంత్రం లోపు డీఏ పై నిర్ణయం

Cmrevanthreddy

Cmrevanthreddy

తెలంగాణలోని ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుంది. రేపు సాయంత్రంలోపు డీఏ (DA)పై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటి వేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సభ్యులుగా.. ప్రత్యేక ఆహ్వానితుడిగా కేకే నియమించారు.

Read Also: TG Govt: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు సాయంత్రం లోపు డీఏ పై నిర్ణయం

అంతకుముందు.. ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ క్రమంలో.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సబ్ కమిటీ చైర్మన్‌గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా, ప్రత్యేక ఆహ్వానితులుగా కె.కేశవరావు ఉంటారని సీఎం తెలిపారు. దీపావళి తరువాత డిపార్ట్‌మెంట్స్ వారీగా కేబినెట్ సబ్ కమిటీ సమావేశమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం తొలి మెట్టు అని అన్నారు. డీఏల విషయంలో రేపు సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటిస్తామని సీఎం హామీ ఇచ్చారు. 317 జీవోపై కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Read Also: Delhi: కేంద్రమంతి జయంత్ సింగ్ కుమార్తె నాట్య ప్రదర్శనపై ఉప రాష్ట్రపతి ప్రశంసలు

Exit mobile version